పెసర గారెలు

ABN , First Publish Date - 2015-09-02T17:43:00+05:30 IST

కావలసిన పదార్థాలు: పెసరపప్పు - 1 కప్పు, తురిమిన క్యాబేజీ - 1 కప్పు, అల్లం - అంగుళం ముక్క

పెసర గారెలు

కావలసిన పదార్థాలు: పెసరపప్పు - 1 కప్పు, తురిమిన క్యాబేజీ - 1 కప్పు, అల్లం - అంగుళం ముక్క, పచ్చిమిర్చి - 3, దనియాల పొడి - 2 టీ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: పెసరపప్పును 15 నిమిషాలు నానబెట్టి అల్లం, పచ్చిమిర్చితో పాటు మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమంలో దనియాల పొడి, ఉప్పు, క్యాబేజి తురుము కలిపి గారెల్లా వత్తుకుని నూనెలో దోరగా వేగించాలి. సాస్‌ లేదా పుదీనా చట్నీ మంచి జోడి.

Updated Date - 2015-09-02T17:43:00+05:30 IST