మురికీలు

ABN , First Publish Date - 2015-12-05T15:46:43+05:30 IST

కావాల్సినపదార్థాలు: వరిపిండి - మూడు కిలోలు, శెనగపిండి - 50గ్రాములు, నువ్వులు - 50 గ్రాములు, జీలకర్ర - 25గ్రాములు, నూనె - మూడున్నర కిలోలు, ఉప్పు - తగినంత.

మురికీలు

కావాల్సినపదార్థాలు: వరిపిండి - మూడు కిలోలు, శెనగపిండి - 50గ్రాములు, నువ్వులు - 50 గ్రాములు, జీలకర్ర - 25గ్రాములు, నూనె - మూడున్నర కిలోలు, ఉప్పు - తగినంత.
తయారుచేయు విధానం: ముందుగా మనం తీసుకున్న వరిపిండి, శెనగపిండి, నువ్వులు, జీలకర్ర, 25గ్రాముల నూనె, తగినంత ఉప్పు వేసుకుని మొత్తం కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందులో మరిగించిన నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద వెడల్పాటి మూకుడు పెట్టి సరిపడా నూనె పోసుకుని బాగా మరగనిచ్చాక కలిపి పెట్టుకున్న పిండని స్టార్‌ బిళ్ల పెట్టిన జంతికల గొట్టంలో పెట్టి నూనెలో నొక్కాలి. మురుకుల్ని ఎరుపు రాగానే తీసేయాలి.

Updated Date - 2015-12-05T15:46:43+05:30 IST