బొబ్బట్లు

ABN , First Publish Date - 2015-11-17T15:12:08+05:30 IST

కావాల్సిన పదార్థాలు: శెనగపప్పు - పావుకిలో, బెల్లం - పావుకిలో, పచ్చికొబ్బరి - అరకప్పు, నెయ్యి - పావుకిలో, మైదాపిండి - 200 గ్రాములు, యాలకులు - పది, నూనె - తగినంత.

బొబ్బట్లు

కావాల్సిన పదార్థాలు: శెనగపప్పు - పావుకిలో, బెల్లం - పావుకిలో, పచ్చికొబ్బరి - అరకప్పు, నెయ్యి - పావుకిలో, మైదాపిండి - 200 గ్రాములు, యాలకులు - పది, నూనె - తగినంత.

తయారుచేయు విధానం:
ముందు మైదాపిండిని కొద్దిగా నీళ్లతో కలుపుకుని నూనెలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు శెనగపప్పుని కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. బాగా మెత్తగా ఉడికాక అందులో బెల్లం, కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి ఉడకనిచ్చి దించేయాలి. చల్లారిన తర్వాత దీన్ని మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు మైదాపిండిని కూడా చిన్న చిన్న ఉండలుగా తీసుకుని ఒక అరిటాకుపై నెయ్యిరాసి దానిపై ఈ ఉండని వెడల్పుగా ఒత్తుకుని మధ్యలో పూర్ణం ఉండ పెట్టుకుని నాలుగువైపులా మూసేసి చేత్తో చపాతిలా మెల్లగా ఒత్తుకోవాలి. ఇప్పుడు పైనంపై నెయ్యి వేసి దానిపై ఒత్తుకున్న బొబ్బట్టుని వేసి దోరగా రెండు వైపులా వేయించుకోవాలి. అంతే నోరూరించే బొబ్బట్లు రెడీ.

Updated Date - 2015-11-17T15:12:08+05:30 IST