
- 16న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా..
కవాడిగూడ/హైదరాబాద్, ఫిబ్రవరి 8: కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టి అందరికీ ఒకే రకం గా నాణ్యమైన విద్యనందించాలని, వచ్చే విద్యా సంవత్సరం నుంచే కేజీ తరగతులను ప్రారంభించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ డిమాండ్ చేసింది. దీనిపై 16న ఇందిరాపార్కు వద్ద ఉపాధ్యాయులతో మహాధర్నా నిర్వహిస్తామ ని తెలిపింది. సోమవారం హైదరాబాద్ దోమలగూడలోని టీఎ్‌సయూటీఎఫ్ భవనలో ‘ప్రభుత్వ విద్యారక్షణ-ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం’ పేరుతో 16న చలో హైదరాబాద్ కార్యక్రమ పోస్టర్‌ను కమిటీ నాయకులు ఎ.నర్సిరెడ్డి, బి.కొండల్‌రెడ్డి, ఎం.రఘుశంకర్‌రెడ్డి ఆవిష్కరించారు. గత ప్రభుత్వాలు విచ్చలవిడిగా అనుమతిచ్చిన ఫలితంగానే తెలంగాణలో విద్యపై వ్యాపారం నడుస్తోందన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచితవిద్య అందిస్తామని ఊరిస్తున్న ప్రభుత్వం.. రెండేళ్లవుతున్నా తరగతులు ప్రారంభించలేదన్నారు. దశాబ్దకాలంగా సర్వీస్ రూల్స్ లేక విద్యారంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అమలుచేస్తే ఆ సంక్షోభం నుంచి బయటపడుతుందన్నా రు. కానీ, ప్రభుత్వంలో కదలికలేదని, ఇంత నిర్ల క్ష్యం సమంజసం కాదన్నారు. తక్షణమే ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ రూపొందించి విద్యాశాఖలో ఖాళీగా ఉన్న 440 ఎంఈవో, 46 డిప్యూటీ ఈవో, 90 శాతం డైట్, బీఈడీ కళాశాలల అధ్యాపకుల పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల ని, పండిట్, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని, జూనియర్ కళాశాల అధ్యాపకుల పోస్టుల్లో 40 శాతం ఇనసర్వీ్స కోటా పునరుద్ధరించాలని, పీ ఆర్సీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.