
పంజాగుట్ట: ప్రజా ప్రయోజనాలు కాపాడటమే ప్రజాస్వామిక ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యమని, కానీ, ప్రస్తుతం ఎన్నికలు వ్యాపారమయం అయ్యాయని తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్, రైతు జేఏసీ నాయకులు నైనాల గోవర్థన్ అన్నారు. తెలంగాణ రైతు జేఏసీ ఆధ్వర్యంలో ‘గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు-ప్రజల కర్తవ్యాలు’పై సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఈ నెల 9వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో తెలంగాణ రైతు జేఏసీ చైర్మన్ జస్టిస్ బి.చంద్రకుమార్‌తో పాటు వివిధ సంఘాలకు చెంది న ప్రతినిధులు పాల్గొంటారన్నారు.