desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Nov 14 2015 @ 19:40PM

పారిస్‌పై ఉగ్రదాడులు మూడో ప్రపంచ యుద్ధంలో భాగమే

వాటికన్ సిటీ: పారిస్‌పై జరిగిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దాడులు మూడో ప్రపంచ యుద్ధంలో భాగమని పోప్ ఫ్రాన్సిస్ చెప్పారు. దాడులు అమానవీయమన్నారు. ఇలాంటి ఉగ్రవాద చర్యలు సరికాదన్నారు. దాడుల్లో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తానని చెప్పారు. పారిస్‌లో ఉగ్రదాడుల్లో 127 మంది చనిపోయారు. 90 మంది తీవ్రంగా గాయపడ్డారు.