Dec 12 2019 @ 05:19AM

మాజీ ఎమ్మెల్యే మాలెం మృతి

గోదావరిఖని, డిసెంబరు 11: మాజీ ఎమ్మెల్యే మాలెం మల్లేశం బుధవారం నిమ్స్‌లో చికిత్స పొం దుతూ మృతి చెందారు. మేడారం నియోజకవర్గానికి మల్లేశం రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. సింగరేణి కార్మికునిగా పని చేసిన ఆయన టీడీపీ ఆవిర్భా వం నుంచి పార్టీలో పని చేశారు. 1985లో ఆయన టీడీపీ టికెట్‌పై, 1994లో స్వతం త్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆయన మృతిపట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే కోరు కంటి, టీఆర్‌ఎస్‌, కాం గ్రెస్‌ నాయకులు సం తాపం ప్రకటించారు.