Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Thu, 10 Oct 2019 02:44:52 IST

శోభాయమానంగా భద్రకాళి కల్యాణోత్సవం

శోభాయమానంగా భద్రకాళి కల్యాణోత్సవం

  • విజయదశమి పర్వదిన వేళ నేత్రపర్వంగా అమ్మవారి తెప్పోత్సవం
  • వేడుకల్లో పాల్గొన్న మంత్రి దయాకర్‌రావు, ప్రజాప్రతినిధులు
వరంగల్‌ కల్చరల్‌, అక్టోబరు 9: వరంగల్‌లోని భద్రకాళి ఆలయంలో వైభవంగా నిర్వహిస్తున్న అమ్మవా రి శరన్నవరాత్రి వేడుకల పర్వంలో బుధవారం రాత్రి వేలాది భక్తుల సమక్షంలో భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నిత్యాహ్నికం, నిత్యపూజాధికాలు నిర్వహించి అమ్మవారిని కల్యాణోత్స వానికి ముస్తాబు చేశారు. శ్రీకాంత్‌కవిత, యాదా కిషన్‌ శోభ, కరీంనగర్‌కు చెందిన రేవూరి ఆంజనేయులుశోభ దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు.
 
ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా వేసిన కల్యాణ వేదికపై అమ్మ వారి ఉత్సవ మూర్తులను ప్రతిష్ఠింపచేసి భద్రకాళి శేషు ఆధ్వర్యంలో మంగళవాయిద్యాలు, వేదమంత్రాల మధ్య కల్యాణోత్సవ తంతు నిర్వహించారు. ఆతర్వాత పుష్ప యాగం నిర్వహించారు. విజయదశమి పర్వదిన వేళ అమ్మవారి తెప్పోత్సవాన్ని నిర్వహించారు.
 
నేత్రపర్వంగా అమ్మవారి తెప్పోత్సవం
భద్రకాళి చెరువులో శోభాయమాన విద్యుత్‌ద్దీప కాంతులతో మిరుమిట్లు గొలుపుతూ సుందరంగా అలం కరించబడిన హంస వాహనంపై భద్రకాళీ భద్రేశ్వరుల కు జలక్రీడోత్సవం, తెప్పోత్సవం నిర్వహించారు. విజయ వాడ నుంచి వచ్చిన నిపుణులచే రూపొందించబడిన తెప్పోత్సవ పడవపై అనేక మంది ప్రముఖులు పాల్గొ న్నారు. అంతకుముందు గోశాల వద్ద ప్రత్యేకంగా వేసిన వెదురు పందిరి కింద ఏర్పాటు చేసిన సింహాసనంపై అమ్మవారిని ప్రతిష్ఠించి ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు, వేదపండితులు పలు రకాల పూజలతో ఆరాధించా రు.
 
తర్వాత కౌతుక బేరంలో అమ్మవారి శక్తిని రావించి తెప్పపై మండపంలో భద్రపీఠంపైఉన్న అమ్మవారి భోగ మూర్తిలో ప్రవేశింప చేసి శోడశోపచార పూజ నిర్వహిం చిన పిమ్మట అమ్మవారి ఆజ్ఞతో తెప్పోత్సవాన్ని ప్రారం భించారు. చెరువులో ముప్పావు కిలోమీటరు దూ రం హంసగా తయారు చేసిన తెప్పపై అమ్మవారికి ప్రము ఖుల సమక్షంలో జలక్రీడ నిర్వహించారు. ఇటీవల కుడా ఆధ్వర్యంలో విస్తరింప చేసిన భద్రకాళి చెరువు కట్టపై పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు తెప్పోత్సవా న్ని సందర్శిస్తూ ఆనందపరవశులయ్యారు.
 
ఆలయ ఈవో ఆర్‌.సునీత సారధ్యంలో రాష్ట్ర పంచా యతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభు త్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ దంపతులు, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌, వరంగల్‌ ఎంపీ పసు నూరి దయాకర్‌, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు దంపతు లు, జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ దంపతులు, పోలీసు కమిషనర్‌ విశ్వనాథ్‌ రవీందర్‌ దంపతులు, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర మహి ళా అధ్యక్షురాలు గుండు సుధారాణి, ఆర్‌డీవో వెంకారెడ్డి, ఏసీపీ నర్సయ్య, స్థానిక కార్పొరేటర్‌ వద్దిరాజు గణేష్‌, వేముల శ్రీనివాస్‌, తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. బుధవారం రాత్రి నిర్వహించిన అమ్మవారి కల్యాణో త్సవ వేడుకలతో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా ముగిశాయి. వేలాది మంది భక్తుల జయజయ ధ్వానాల మధ్య వేడుకల పర్వం ముగిసింది.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.