Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Sun, 08 Sep 2019 04:07:20 IST

మన తెలుగుభాషకు ఎంతో ప్రాచుర్యముంది

మన తెలుగుభాషకు ఎంతో ప్రాచుర్యముంది

  • తెలంగాణ భాషా దినోత్సవంలో ప్రముఖ కవి, పరిశోధకుడు డాక్టర్‌ మలయశ్రీ
మంకమ్మతోట, సెప్టెంబరు 7: తెలంగాణ తెలుగు భాష ఎంత ప్రాచు ర్యమైందో, అంతే విశిష్టమైందని, దానిని నిలబెట్టుకోవడం మన బాధ్యత అని ప్రముఖ కవి పరిశోధకుడు డాక్టర్‌ మలయశ్రీ అన్నారు. శనివారం కరీంనగర్‌ ప్రభుత్వ మహిళ డ్రిగీ కళాశాల తెలుగు విభాగ ఆధ్వర్యంలో జరిగిన(ముందుస్తు) తెలంగాణ భాషా దినోత్సవ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన తెలుగు భాషా విశిష్టత అనే ఆంశంపై ప్రసంగించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి లక్ష్మి మాట్లాడుతూ కాళోజి, జయశంకర్‌ వంటి మహనీయులు తెలంగాణ భాషా సంస్కృతుల కోసం అలుపెరుగని పోరాటం చేశారని అని అన్నారు. తెలుగు విభాగం అధ్యక్షుడు సదస్సు సమన్వయ కర్త డాక్టర్‌ మట్ట సంపత్‌కుమార్‌రెడ్డి తెలంగాణ భాషా పూర్వపరాలను వివరించారు.సెప్టెంబర్‌9 కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపాల్సి ఉన్నప్పటికీ ఆరోజు కళాశాలకు ఐచ్చిక సెలువు దినం అయినందున ముందస్తుగా ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో తెలుగు విభాగం అధ్యాపకులు కంజర్ల శ్రీలత, నారోజు వెంకటరమణ, పొరండ్ల శంకర్‌, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.