Feb 28 2015 @ 13:05PM

విడుదలైన 'టామీ' సినిమా పాటలు

టామీ' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై.... యూనిట్ సభ్యులను అభినందించారు. ఉత్తమాభిరుచి కలిగిన నిర్మాత హరిబాబుకు ఈ సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. 'టామీ' చిత్ర విజయంపై తనకు పూర్తి విశ్వాసం  ఉందని హరిబాబు తెలిపారు. మార్చి 1వ తేదీ వైజాగ్ లో ప్రివ్యూ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. అలానే అదే నెల 13న విడుదలయ్యే ఈ సినిమాతో వచ్చే లాభాలను వైజాగ్ పునర్ నిర్మాణానికి, డాగ్స్ వెల్ఫేర్ కు ఉపయోగిస్తామన్నారు.