Aug 23 2019 @ 10:37AM

‘ఓమ్లీ’ క్యాటరింగ్ సర్వీసెస్ యాప్ లాంచ్ చేసిన మధు శాలిని

హైదరాబాద్: ‘ఓమ్లీ’ క్యాటరింగ్ సర్వీసెస్ యాప్‌ను టాలీవుడ్ ముద్దుగుమ్మ మధు శాలిని ఆవిష్కరించారు. నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ‘ఓమ్లీ’ వ్యవస్థాపకుడు, సీఈవో కిరణ్ వగ్గా పాల్గొన్నారు. క్యాటరింగ్ సర్వీసెస్‌ను ఒకే గూటి కిందకు తెచ్చిన కంపెనీ యాజమాన్యాన్ని మధు శాలిని అభినందించారు. అందరికీ అందుబాటులో ఉండేలా వీరి సేవలు ఉన్నాయని ఆమె తెలిపారు. 2024నాటికి దేశవ్యాప్తంగా తమ సేవలు అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని సీఈవో కిరణ్ తెలిపారు.