
తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా (తెల్సా) 21వ వార్షికోత్సవం సందర్భంగా కథ, నాటక రచనల పోటీ నిర్వహిస్తున్నది. కథా విభాగంలో మూడు, నాటక విభాగంలో రెండు ఉత్తమ రచనలకు బహుమతులనిస్తారు. కథల పోటీలో మొదటి బహుమతి రూ.30వేలు, రెండవ బహుమతి రూ.20వేలు, మూడవ బహుమతిగా రూ.15వేలు నగదు ఇస్తారు. నాటికల విభాగంలో మొదటి బహుమతిగా రూ.40వేలు, రెండవ బహుమతిగా రూ.25,వేలు బహూకరిస్తారు. రచనలు జూలై 31వ తేదీలోగా ఈమెయిల్:
[email protected]కు పంపాలి. మరిన్ని వివరాలకు https://www.telsaworld.orgలో సంప్రదించవచ్చు.
తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా