Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Mon, 10 Jun 2019 02:38:59 IST

గ్రామీణ భారత దిశా నిర్దేశకుడు బి.వి.పరమేశ్వరరావు కన్నుమూత

గ్రామీణ భారత దిశా నిర్దేశకుడు బి.వి.పరమేశ్వరరావు కన్నుమూత

హైదరాబాద్‌, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ విద్యావేత్త, గ్రామీణ భారత అభివృద్ధికి దిశా నిర్దేశం చేసిన డాక్టర్‌ భాగవతుల వెంకట పరమేశ్వర రావు (86) కన్నుమూశారు. కొద్దికాలంగా హృద్రోగంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా యలమంచిలి మండలం దిమిలి గ్రామానికి చెందిన పరమేశ్వరరావు 1967లో అమెరికాలోని ప్రతిష్ఠాత్మక పెన్‌స్టేట్‌ వర్సిటీ నుంచి న్యూక్లియర్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తిచేశారు. అప్పట్లోనే న్యూక్లియర్‌ శాస్త్రవేత్తగా అమెరికాలో అనేక అవకాశాలు వచ్చినా.. 1967లో దిమిలిలో పాఠశాలను ప్రారంభించి, పేదలకు ఉచితంగా విద్యనందించారు. 1976లో భాగవతుల చారిటబుల్‌ ట్రస్టు (బీసీటీ)ను ప్రారంభించి విద్యతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులు, మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ, ఆరోగ్య సేవలు, వ్యవసాయ పరిశోధన, బీడు భూములను సాగులోకి తేవడం లాంటి అనేక విప్లవాత్మక కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించారు. గ్రామీణ కళలు, సంస్కృతి పరిరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. పరమేశ్వరరావుమృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎ్‌సఎల్‌ నరసింహన్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బీసీటీ ద్వారా పరమేశ్వరరావు చేపట్టిన కార్యక్రమాలను గుర్తుచేసుకున్నారు.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.