
‘మన్మథుడు-2’ బ్యాచ్‌లోకి మహానటి కీర్తి సురేశ్ జాయిన్ అయ్యారు. ఈ చిత్రంలో రెండో హీరోయిన్గా నటిస్తున్న ఆమెపై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా కొన్ని స్టిల్స్‌ను హీరో నాగార్జున సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
మన్మథుడు ఇన్స్పిరేషన్తో ఆ సినిమాకు సీక్వెల్‌గా నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘మన్మథుడు 2’ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మనం ఎంటర్‌ప్రైజస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ (జెమిని కిరణ్) నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.