Jun 2 2019 @ 09:12AM

ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న కేసీఆర్..

హైదరాబాద్: తెలంగాణ అవతరణ దినోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపానికి ఆదివారం గులాబీ బాస్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు. అనంతరం నేరుగా అక్కడి నుంచి బయల్దేరి నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లో జరిగే రాష్ట్ర అవతరణ వేడుకల కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ చేసి పోలీసుల నుంచి సీఎం కేసీఆర్ గౌరవ వందనం స్వీకరించారు. సభాముఖంగా తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
 
ఐదేళ్లలో ఎన్నో అవరోధాలు అధిగమించామని కేసీఆర్ చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏయే కార్యక్రమాలు చేపడుతుందనే విషయాలపై కేసీఆర్ మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ స్పీచ్‌ను లైవ్‌లో చూడగలరు...