Jan 20 2015 @ 22:31PM

క్రైమ్‌ కామెడీతో...

విక్రమ్‌శేఖర్‌, ప్రభ్‌జీత్‌ కౌర్‌ జంటగా నటించిన ‘ఇంటలిజెంట్‌ ఇడియట్స్‌’ చిత్రం ఈ నెల 23న విడుదలవుతోంది. స్పైసీ క్రియేషన్స్‌, శ్రీ చేజెర్లమ్మ క్రియేషన్స్‌ పతాకాలపై శరద్‌ మిశ్రా, శ్రీహరి ఎం., శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసులు దంపూరి నిర్మించిన ఈ చిత్రానికి బాలాజీ దర్శకుడు. మంగళవారం నిర్మాతల మండలి హాలులో ఏర్పాటుచేసిన సమావేశంలో నిర్మాత శ్రీహరి మాట్లాడుతూ క్రైమ్‌ కామెడీ మూవీగా ఇది రూపొందిందనీ, ఓ వైపు నవ్విస్తూనే, మరోవైపు గుండెలు దడదడలాడిస్తుందనీ అన్నారు. అంధుడిగా నటించిన సప్తగిరి నవ్విస్తూనే ఏడిపిస్తాడని చెప్పారు. హీరో విక్రమ్‌శేఖర్‌ మాట్లాడుతూ నేటి యువత ఎదుర్కొంటున్న సమస్యలతో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తయారయ్యిందన్నారు. ఈ సినిమాలో అందర్నీ ఆశ్చర్యపరిచే థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయని దర్శకుడు బాలాజీ తెలిపారు. ఈ సమావేశంలో హీరోయిన్‌ ప్రభ్‌జీత్‌ కౌర్‌, నిర్మాతలు శరద్‌ మిశ్రా, శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసులు, నిర్మాణ నిర్వాహకురాలు శ్రీరమ్య పాల్గొన్నారు.