
‘తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా (తెల్సా)’ 21వ వార్షికోత్సవాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంత ఉన్నత పాఠశాలల్లోని 6, 7, 8 తరగతుల విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ళను పంపిణీ చేయనున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకునే పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పేరు, మొబైల్ నెంబరు, స్కూలు పేరు, చిరునామా, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడీ, పాఠశాల విద్యార్థుల సంఖ్య తదితర వివరాలను in
[email protected] మెయిల్‌కు పంపించాలి. మెయిల్ పంపిన వారికి దరఖాస్తులు ఇస్తారు. అవి పూర్తి చేసి అందజేసిన పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను అందజేస్తారు. వివరాలను వెంటనే పంపించాలని కోరుతున్నారు.
మురళి చండూరి
‘తెల్సా’ అధ్యక్షుడు