Apr 7 2019 @ 20:56PM

బుర్రా సాయిమాధవ్‌కు పితృ వియోగం

ప్రముఖ నాటక రంగ ప్రముఖులు, అభినవ చింతామణిగా పేరొందిన బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి(84) కన్ను మూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం మోహదీపట్నంలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. నాటకరంగంలో‌ నటుడుగా, దర్శకుడిగా సుబ్రహ్మణ్యశాస్త్రి తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని, గుర్తింపును సాధించారు. ఇప్పడున్న ఎంతో మంది నాటకరంగ ప్రముఖులు ఒకప్పుడు సుబ్రహ్మణ్యశాస్త్రి శిష్యులే. తెలుగు బాషకు, సాహిత్యానికి, నాటకరంగానికి చేసిన సేవలకుగానూ ఎన్నో ప్రతిభా పురస్కారాలను, అవార్డులను ఆయన అందుకున్నారు. ఆయనకు ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. సినీ రచయిత బుర్రా సాయిమాధవ్ సుబ్రహ్మణ్య శాస్త్రి పెద్దకుమారుడు.