Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Fri, 29 Mar 2019 11:15:07 IST

ఐపీఎస్‌ల బదిలీ కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

ఐపీఎస్‌ల బదిలీ కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

అమరావతి: ఐపీఎస్‌ల బదిలీ కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, కడప ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మలను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయడంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి.
 
కేంద్ర ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు విముఖత వ్యక్తం చేసింది. ఇంటెలిజెన్స్‌ డీజీ బదిలీపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. బదిలీలపై ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.