Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Sat, 16 Mar 2019 02:52:45 IST

కొత్త పొత్తు

కొత్త పొత్తు

  • బీఎస్పీతోనూ జనసేన దోస్తీ
  • లఖ్‌నవూలో మాయావతితో పవన్‌ భేటీ
  • 3, 4 తేదీల్లో ప్రచారానికి బీఎస్పీ అధినేత
అమరావతి, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): నిన్నటి వరకూ వామపక్షాలతో కలిసి సార్వత్రిక ఎన్నికలకు వెళ్తామంటూ ప్రకటిస్తూ వచ్చిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌ తాజాగా సరికొత్త పొత్తుకు శ్రీకారం చుట్టారు. పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌తో కలిసి శుక్రవారం లఖ్‌నవూ వెళ్లిన పవన్‌ బీఎస్పీ అధినేత్రి మాయావతితో సమావేశమయ్యారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను, వామపక్షాలతో కలిసి సార్వత్రిక ఎన్నికల గోదాలోకి దిగేందుకు అనుసరిస్తోన్న కార్యాచరణను ఆమె కు వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు చేసిన అన్యా యం గురించి వివరించారు. రాష్ట్రంలో బీజేపీ, వైసీపీ అనైతిక పొత్తులతో పనిచేస్తున్నాయని తెలిపారు.
 
మోదీ, జగన్‌ అమలు చేస్తున్న రాజకీయ వ్యూహాలతో రాష్ట్రం ఏవిధంగా నష్టపోతుందో మాయావతికి దృష్టికి తీసుకొని వెళ్లారు. ఇలాంటి తరుణంలో కేంద్రంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కావాలని పవన్‌ ఆకాంక్షించారు. ఈ చర్చల క్రమంలో వామపక్షాలు, బీఎస్పీ, జనసేన కలసి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అభ్యర్థులను ఎంపిక చేసి ఎన్నికల బరిలోకి దిగాలన్న అభిప్రాయానికి వచ్చారు. ఏపీలో బీఎస్పీ, వామపక్షాలు, జనసేనతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం వల్లే ఈ వర్గాలకు మేలు జరుగుతుందన్న అభిప్రాయం ఆ భేటిలో వ్యక్తమైంది. ఏప్రిల్‌ 3, 4 తేదీల్లో ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి తన అంగీకారాన్ని తెలిపారు.
 
మాయావతి ప్రధాని కావాలి
‘‘రాజకీయ చైతన్యంతో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, సమసమాజాన్ని కోరుకునే సిద్ధాంత కలిగిన నేత మాయావతి. ఆమె ప్రధాని కావాలి. తెలుగు రాష్ట్రాల్లో వామపక్షాలు, బీఎస్పీతో కలసి జనసేన ఎన్నికల బరిలోకి దిగుతుంది’’ అని పవన్‌ తెలిపారు.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.