Feb 19 2019 @ 11:56AM

అట్టహాసంగా తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం

హైదరాబాద్: రాజ్‌భవన్‌లో తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం అట్టహాసంగా జరిగింది. మొత్తం 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారి చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్‌రెడ్డి, ఈటెల రాజేందర్, నిరంజన్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, హోంమంత్రి మహమూద్ అలీ, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్‌రావు, పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.