Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Mon, 18 Feb 2019 20:33:08 IST

తెలంగాణ కొత్త కేబినెట్‌‌లో ఎవరికి ఏ శాఖ ఇస్తున్నారంటే...!

తెలంగాణ కొత్త కేబినెట్‌‌లో ఎవరికి ఏ శాఖ ఇస్తున్నారంటే...!

హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం ఉదయం 11:30 గంటలకు కేబినెట్ విస్తరణ జరగనుంది. 9 మంది గులాబీ నేతలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తలసానికి మళ్లీ కేబినెట్‌‌లో అవకాశం వచ్చింది. కాగా.. ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్‌లు కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే కాబోయే మంత్రులకు జీఏడీ ఆహ్వానాలు పంపింది. మరోవైపు సీఎం కేసీఆర్‌ కూడా ప్రమాణం చేయబోయే మంత్రులంతా ప్రగతి భవన్‌కు రావాలంటూ ఫోన్‌ చేశారు. డిప్యూటీ స్పీకర్‌గా మాజీమంత్రి పద్మారావు గౌడ్, చీఫ్ విప్‌గా దాస్యం వినయ్ భాస్కర్ ‌ప్రమాణం చేయనున్నారు. కాగా లోక్ సభ ఎన్నికల తర్వాత మరో 6గురు నేతలతో తుది విస్తరణ జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
 
సామాజిక వర్గం పరంగా చూస్తే...
కాగా మంగళవారం జరగనున్న కేబినెట్ విస్తరణలో ఖమ్మం మినహా అన్ని ఉమ్మడి జిల్లాలకు దక్కిన చోటు దక్కింది. సామాజిక వర్గాల వారికి దక్కనున్న మంత్రి పదవులు దక్కాయి. రెడ్డి - 5, వెలమ - 1, ఎస్సీ(మాల) - 1, బీసీ- 2 గులాబీ నేతలకు మంత్రి పదవులు వరించాయి. ఇదిలా ఉంటే మంత్రులకు కేటాయించనున్న శాఖలపై టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి.
 
ఎవరికి ఏ శాఖ అంటే...
కేసీఆర్: నీటిపారుదల, పంచాయితీ రాజ్ శాఖలు
నిరంజన్ రెడ్డి : ఆర్థిక శాఖ
శ్రీనివాస్ గౌడ్ : - ఎక్సైజ్, సంక్షేమ శాఖ
తలసాని శ్రీనివాస్: పశు సంవర్ధక శాఖ
ఎర్రబెల్లి దయాకర్ రావు : రోడ్లు భవనాల శాఖ
జగదీశ్వర్ రెడ్డి : విద్యా, విద్యుత్ శాఖలు
ప్రశాంత్ రెడ్డి : వ్యవసాయం, మార్కెటింగ్
కొప్పుల ఈశ్వర్ : పంచాయితీ రాజ్‌ శాఖ(కొప్పులకు ఏ శాఖ అనేదానిపై పూర్తి స్పష్టత లేదు)
మల్లారెడ్డి : రవాణా శాఖ
ఇంద్రకరణ్ రెడ్డి : వైద్యం, ఆరోగ్యశాఖలు వరించాయి. కాగా మంగళవారం ఉదయం ఈ లెక్కలన్నీ ఎంత వరకు నిజమవుతాయో వేచి చూడాల్సిందే.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.