Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Tue, 12 Feb 2019 10:09:49 IST

ప్రముఖ దర్శక, నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత

ప్రముఖ దర్శక, నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత

ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు నేటి ఉదయం మృతి చెందారు. 1936 సెప్టెంబర్ 22న చాటపర్రులో జన్మించిన బాపినీడు ఎన్నో హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన అసలు పేరు.. గుట్టా బాపినీడు చౌదరి. ఇండస్ట్రీకి వచ్చిన తరువాత తన పేరును విజయ బాపినీడుగా మార్చుకున్నారు. తన కుమార్తెలు నిర్మించిన ‘కొడుకులు’ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. బాపినీడు ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవితోనే సినిమాలు రూపొందించారు.
 
చిరంజీవి హీరోగా వచ్చిన 'మగ మహారాజు'తో దర్శకుడిగా మారిన బాపినీడు.. అనంతరం మహానగరంలో మాయగాడు, మగధీరుడు, ఖైదీ నంబర్ 786, గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌ను ఇండస్ట్రీకి అందించారు. రాజాచంద్ర, దుర్గా నాగేశ్వరరావు, జి.రామమోహనరావు, మౌళి, వల్లభనేని జనార్దన్‌‌లను దర్శకులుగా పరిచయం చేశారు. అలాగే పాటల రచయితగా భువనచంద్రను, మాటల రచయితగా కాశీ విశ్వనాథ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత బాపీనీడుదే. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.