
గుంటూరు: మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర విశ్రాంత ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జె.రాంబాబు పేర్కొన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శ్రీనాథ పీఠం ఆధ్వర్యంలో సో మవారం కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్దేశ్వరానంద భారతి మహాస్వామి సహస్ర చంద్ర దర్శన ఉత్సవాలు వైభ వంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన సభకు అధ్యక్షత వహించిన జె.రాంబాబు మాట్లాడుతూ దేశంలో ధర్మపాలన జరిగేది స్వామిజీల ఆశీస్సులతోనే అన్నారు. శ్రీ సిద్దేశ్వర పీఠ ధర్మాధికారి డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావు సిద్దేశ్వరయానం గ్రంథాన్ని ఆవి ష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ చీఫ్ సెక్రటర్ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆధ్యాత్మికతకు, సాహిత్యానికి విడదీయని అనుబంధం ఉందన్నారు. సభలో స్టాంప్ డ్యూటీ కమిషనర్ వెంకట రామిరెడ్డి, భువనేశ్వరి పీఠాధిపతి సత్యానందభారతి స్వామి ఆల య కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, భారతి ధా ర్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారా యణ పాల్గొన్నారు. అనంతరం శ్రీ సిద్దేశ్వరానంద భారతిస్వామి భక్తులను ఉద్దేశించి అను గ్రహ భాషణం చేశారు. కార్యక్రమాన్ని సంస్థ కార్యదర్శి డాక్టర్ వై. గౌరీశంకర్, సంయోజకులు పీఎస్ఆర్ ఆంజ నేయప్రసాద్, జీవైఎన్ బాబు పర్యవేక్షించారు.