Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Wed, 26 Dec 2018 02:13:41 IST

బంధుకు నిధుల కొరత

బంధుకు నిధుల కొరత

  • 10 లక్షల మందికి అందని సాయం
  • పెండింగ్‌ నిధులు రూ.500 కోట్లు
  • పక్షం రోజులుగా నిలిచిన చెల్లింపులు
  • జనవరి తొలివారంలో బదిలీ అయ్యే అవకాశం
హైదరాబాద్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల కమిషన్‌ అభ్యంతరాలను, అడుగడుగునా వస్తున్న ఆటుపోట్లను తట్టుకుంటూ ముందుకు సాగిన ‘రైతు బంధు’ పఽథకం.. పక్షం రోజులుగా నిధుల కొరతతో నిలిచిపోయింది. ఇంకా 10 లక్షల మంది రైతులు రైతుబంధు కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా రూ.500 కోట్లను పంపిణీ చేయాల్సి ఉంది. శాసనసభ ఎన్నికల ముందు వరకు, ఈనెల మొదటి వారంలో ఆన్‌లైన్‌లో నిధుల బదిలీ జరిగింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. రబీ సీజన్‌లో 52 లక్షల మందికి రైతు బంధు సాయం పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకొన్న విషయం తెలిసిందే. ఈనెల మొదటి వారం వరకు 45 లక్షల మంది రైతులకు ఆన్‌లైన్‌ ద్వారా నిధులు బదిలీ చేశారు. మరో 7 లక్షల మంది మిగిలిపోయారు. ఇక, ఖరీఫ్‌ సీజన్‌లో రైతుబంధు తీసుకోకుండా, పట్టాదారు పాస్‌ పుస్తకాల సమస్యలు పరిష్కారమైన రైతులు మరో 3 లక్షల మంది ఉన్నారు. ఎన్నికల కమిషన్‌ అభ్యంతరాలతో వీరికి రైతుబంధు నగదు పంపిణీ జరగలేదు. వీరంతా వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంకా తమ ఖాతాల్లో డబ్బులు పడలేదని నిలదీస్తున్నారు.
 
వారి డేటాను అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేసినా.. ఇప్పుడు సమస్యంతా ప్రభుత్వ ఖజానా, ట్రెజరీలో ఉంది. పెన్షన్లు, వేతనాలు, ఇతరత్రా సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు సర్దుబాటు చేసేందుకు రైతు బంధుకు నిధులు నిలిపివేశారు. కొన్ని నిధులేమో రంగారెడ్డి ట్రెజరీలో పెండింగ్‌లో ఉన్నాయి. జన్‌ధన్‌ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన సమస్యలు కొన్ని ఉన్నాయి. అన్నీ కలిసి 10 లక్షల మందికి సాయం నిలిచిపోయింది. నెలాఖరుకు కూడా నిధులు సర్దుబాటయ్యే పరిస్థితి కనిపించటం లేదు. పైగా, ఒకటో తేదీన వేతనాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో, జనవరి మొదటి వారంలో రైతు బంధుకు నిధులు సర్దుబాటు చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. గ్రామాల్లో కొంతమంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడి.. మరికొందరి ఖాతాల్లో పడకపోవటంతో వ్యవసాయ శాఖ అధికారులు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.