desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 23 2018 @ 03:33AM

పది మందికి తెలుగు విశ్వవిద్యాలయ అవార్డులు

  • అయాచితం, శంకరమంచి మరో 8 మంది ఎంపిక
రవీంద్రభారతి/హైదరాబాద్‌, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియల్లో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2016 సంవత్సరానికి సాహితీ పురస్కారాలు ప్రకటించింది. పద్య కవితా ప్రక్రియలో ఈసారి అయాచితం నటేశ్వరశర్మ ‘శకుంతల’, వచన కవితా ప్రక్రియలో అన్నవరం దేవేందర్‌ రచించిన ‘పొక్కిలి వాకిళ్ళ పులకరింత సాహితీ పురస్కారాలకు ఎంపికయ్యాయి. బాల సాహిత్యంలో చొక్కాపు వెంకటరమణ రచించిన ‘చెట్టు చెప్పిన కథలు’, కథానిక ప్రక్రియలో ఎంఎం వినోదిని రచించిన ‘బ్లాక్‌ ఇంక్‌’ కథా సంపుటి, నవలా ప్రక్రియలో అక్కినేని కుటుంబరావు రచించిన ‘కొల్లేటి జాడలు’ నవల, సాహిత్య విమర్శలో జి.లక్ష్మీనరసయ్య రచించిన ‘కవిత్వ నిర్మాణ పద్ధతులు’ పురస్కారాలకు ఎంపికయ్యాయి. నాటకం, నాటికల్లో శంకరమంచి పార్థసారథి రచించిన హాస్య నాటికలు, అనువాదంలో ఐతా చంద్రయ్య రచించిన హిందీ కథా సంగ్రహం’, ఇతర వచన రచనల విభాగంలో ద్యావనపల్లి సత్యనారాయణ రచించిన ‘తెలంగాణలో కొత్త చారిత్రక స్థలాలు’, రచయిత్రి ఉత్తమ గ్రంథం విభాగంలో రాణి ప్రేమలత రచించిన ‘అలోకనం’ గ్రంథాలు సాహితీ పురస్కారాలు దక్కించుకున్నాయి.