
నటీనటులు: వరుణ్ తేజ్, అదితిరావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్, శ్రీనివాస్ అవసరాల తదితరులు
నిర్మాణ సంస్థ: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్
కెమెరా: జ్ఞానశేఖర్ విఎస్ (బాబా)
ఎడిటర్: కార్తిక్ శ్రీనివాస్
ప్రొడక్షన్ డిజైనర్స్: రామకృష్ణ సబ్బాని, మోనిక నిగొత్రే సబ్బాని
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
స్టంట్స్: టడోర్ లజరోవ్
సిజి: రాజీవ్ రాజశేఖరన్
దర్శకుడు: సంకల్ప్ రెడ్డి
నిర్మాతలు: రాధాకృష్ణ జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఎడుగూరు, సాయి బాబు జాగర్లమూడి
విడుదల: 21.12.2018
‘ఘాజీ’ సినిమా విడుదలై థియేటర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేవరకు ఎవరికీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి గురించి తెలియదు. తన ఇంటి మీద సెట్ వేసి సినిమా తీసి ప్రేక్షకుల్ని మెప్పించారాయన. ఇప్పుడు ఆయనకు ప్రాపర్ బడ్జెట్, ప్రాపర్ ప్లానింగ్, బ్యాక్ ఎండ్ సపోర్ట్ లభించాయి. దాంతో ఆయన అంతరిక్షంలో విహారం చేయడానికి సిద్ధమయ్యారు. సినిమాకు కూడా అంతరిక్షం 9000కెఎంపీహెచ్ అనే టైటిల్ పెట్టారు. వరుస విజయాలమీదున్న వరుణ్ తేజ్ కి ఈ సినిమా హ్యాట్రిక్ అవుతుందా.. చూసేద్దాం.
కథ:
ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహం మిహిర కక్ష్య తప్పుతుంది. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనికేషన్స్ దెబ్బతింటాయి. దీంతో ఇస్రో దీన్ని సరి చేసే పనిలో పడుతుంది. అయితే దాన్ని సరిచేసే వ్యక్తి ఎవరా? అని ఆలోచిస్తే వారికి దొరికే సమాధానం దేవ్(వరుణ్ తేజ్). అయితే దేవ్ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సెలవులపై ఉంటాడు. అతనెక్కడుంటాడో ఎవరికీ తెలియదు. దాంతో శాస్త్రవేత్తలు ఏం చేయాలని ఆలోచిస్తారు. చివరకు రియా(అదితిరావు హైదరి) రంగంలోకి దిగి దేవ్ అచూకి కనిపెడుతుంది. అతన్ని అంతరిక్షంలోకి వెళ్లడానికి ఎలా ఒప్పిస్తుంది? చివరకు దేవ్ అంతరిక్షంలోకి వెళ్లి ఏం చేశాడు? సమస్యను పరిష్కరించాడా? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
ప్లస్ పాయింట్స్:
- కథాంశం
- సినిమా బ్యాక్‌డ్రాప్
- గ్రాపిక్స్
- సెకండాఫ్‌లో ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్:
- మల్టీప్లెక్ మూవీగా నిలిచిపోతుందేమో
- కమర్షియల్ సినిమా ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ కాకపోవచ్చు
విశ్లేషణ:
సాధారణంగా హాలీవుడ్ బాండ్ సినిమాల్లో హీరో కనపడకుండా ఉంటాడు. అతన్ని వెతికి పట్టుకుని ప్రాజెక్ట్ అప్పగించడం అనే స్టైల్లో ఈ సినిమాలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల హీరో సెలవుల్లో ఉంటాడు. అతన్ని పట్టుకుని ప్రాజెక్ట్ అప్పగిస్తారు. దేవ్ పాత్రలో వరుణ్‌తేజ్ చక్కగా ఒదిగిపోయాడు. అస్ట్రానాయిడ్ పాత్రలో హుందాగా నటించాడు. అదితిరావు హైదరి.. లేడీ అస్ట్ర్రానాయిడ్గా, దేవ్‌ను గోల్ వైపు మళ్లించే పాత్రలో చక్కగా నటించింది. సత్యదేవ్ డ్యూయెల్ రోల్లో నటించాడు. అవసరాల శ్రీనివాస్ పాత్ర ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లో నటించాడు. రెహమాన్, లావణ్య త్రిపాఠి తదితరులు వారి వారి పాత్రల మేర చక్కగా నటించారు. ఇక సాంకేతికంగా చూస్తే..
ఘాజి సినిమాతో తెలుగు సినిమాను కొత్త మలుపు తిప్పిన దర్శకుడు సంకల్ప్.. రెండో సినిమా ఎలా ఉంటుందోనని అందరరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అందరి ఆలోచనలకు భిన్నంగా అంతరిక్షం అనే టైటిల్ పెట్టి తొలి టాలీవుడ్ స్పేస్ మూవీని తెరకెక్కించాడు. ఆది నుండి ఓ టెంపోను క్యారీ చేయించాడు. దర్శకుడి ఆలోచనకు హ్యాట్పాఫ్ చెప్పాల్సిందే. 25-30 కోట్ల బడ్జెట్లో హాలీవుడ్ ఆలోచనాస్థాయి మూవీ చేయడం గొప్ప విషయం. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీతో సినిమాను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాడు. గ్రాఫిక్స్ చాలా బాగా చేశాడు. రాజీవ్ ను ఈ విషయంలో అభినందించాల్సిందే. ఇలాంటి సినిమాలకు డైలాగ్స్ రాయడం కూడా గొప్ప విషయం. కిట్టు మంచి డైలాగ్స్ రాశాడు. పాటలు కథానుగుణంగా ఉన్నాయి. ఇలాంటి సినిమాల్లో ఎంటర్టైన్మెంట్, కామెడీ సన్నివేశాలను ఆశించడం తప్పే అవుతుంది. గ్రిప్పింగ్ సినిమా రన్ అవుతుంది. టెక్నికల్ టర్మ్స్ నార్మల్ ప్రేక్షకులకు అర్థం కాకపోవచ్చు. కమర్షియల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు సినిమా నచ్చదు. అయితే కొత్త అటెంప్ట్ చేసిన యూనిట్‌ను, దర్శకుడి టేకింగ్, గ్రాఫిక్స్, నిర్మాణ విలువలను అభినందించాల్సిందే...
చివరగా.. ‘అంతరిక్షం’... టాలీవుడ్ గొప్ప ప్రయత్నం
రేటింగ్: 3/5