desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 18 2018 @ 02:44AM

20 నుంచి సిమెంట్‌ ఎక్స్‌పో

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): ఫస్ట్‌ కన్‌స్ట్రక్షన్‌ కౌన్సిల్‌ (ఎఫ్‌సీసీ) ఆధ్వర్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో మాదాపూర్‌ హైటెక్స్‌లో సిమెంట్‌ ఎక్స్‌పో-2018 జరగనుంది. ఈ ప్రదర్శనలో 100కు పైగా స్టాళ్లు ఉంటాయని, 70 వరకు అంతర్జాతీయ సంస్థలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయని ఎఫ్‌సీసీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రతాప్‌ పదుడే తెలిపారు. ప్రదర్శనలో భాగంగా సిమెంట్‌ రివ్యూ కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తున్నామని, ఇందులో సిమెంట్‌ పరిశ్రమలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై చర్చ ఉంటుందన్నారు. సిమెంట్‌, నిర్మాణ రంగానికి చెందినవారే కాకుండా పెట్టుబడిదారులు కూడా పాల్గొంటారని చెప్పారు. తెలుగు రాష్ర్టాల్లో సిమెంట్‌ పరిశ్రమ ఏడు శాతం వృద్ధిని సాధించిందన్నారు.