Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Mon, 10 Dec 2018 12:45:40 IST

ఆంధ్రజ్యోతితో ఆసక్తికర విషయాలను పంచుకున్న కోట శంకరరావు

ఆంధ్రజ్యోతితో ఆసక్తికర విషయాలను పంచుకున్న కోట శంకరరావు

  • ప్రేక్షకుల బలహీనతను ఆసరాగా తీసుకోవద్దు
  • నటుడు కోట శంకరరావు
ప్రేక్షకులు ఇష్టపడేవి కాదు... వారు చూడాల్సిన సీరియళ్లను, సినిమాలను నిర్మాతలు రూపొందించాల్సిన అవసరం ఉంది. వారి బలహీనతలను ఆసరాగా తీసుకోవద్దు. బాగుపడాలన్నా, చెడిపోవాలన్నా సినిమాలు, టీవీ సీరియళ్ళ వల్లనే అంటున్నారు ప్రముఖ సినీ, నాటక, బుల్లితెర నటుడు కోట శంకరరావు. ఇటీవల తిరుపతికి వచ్చిన ఆయన ఆంధ్రజ్యోతితో కాసేపు ముచ్చటించారు.
 
ముగ్గురన్నదమ్ములం నటులమే
మా తండ్రి రంగస్థల అభిమాని కావడంతో అన్నదమ్ములమైన కోట నరసింహరావు, కోట శ్రీనివాసరావు, కోట శంకరరావులమైన మేము చిన్నప్పటి నుంచే నాటకాల పట్ల ఆసక్తి చూపాం. మా స్వగ్రామం కృష్ణా జిల్లా కంకిపాడు. ఆంధ్ర రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నాటకాలు వేశాం. చదువులు పూర్తయి హైదరాబాదులో స్టేట్‌ బ్యాంక్‌ ఉద్యోగాలు మా అన్న కోట శ్రీనివాసరావుతోపాటు నాకూ లభించాక సినిమాల్లో నటించే అవకాశం లభించింది. అయినప్పటికీ నాటరంగాన్ని వదల్లేదు.
 
అదే క్రమంలో దూరదర్శన్‌ కార్యక్రమాల్లో నటించే అవకాశాలొచ్చాయి. టీవీ సీరియల్స్‌ అవకాశాలూ కలిసొచ్చాయి. సుమారు 100 సినిమాల్లో, 70 సీరియల్స్‌లోనూ నటించా. మూడు నంది అవార్డులు అందుకున్నా. అకాడమీ ఆఫ్‌ యూనివర్సిల్‌ గ్లోబల్‌ పీస్‌ సంస్థ 2014లో డాక్టరేట్‌ ప్రదానం చేసింది. కుప్పంలో కళాప్రపూర్ణ అవార్డును ఈ ఏడాదిలోనే పొందా. అంకురం, సూత్రదారులు, లాల్‌సలాం, చీమలదండు, హలోబ్రదర్‌, పల్నాటి పౌరుషం, దేవి సినిమాలు గుర్తింపు తీసుకొచ్చినప్పటికీ సీరియళ్ళలోనే ఎక్కువగా నటించే అవకాశం వచ్చింది.
 
నాటకరంగంలో ఆదాయం లేకే....
నాటక రంగానికి ప్రాధాన్యత తగ్గింది. కాలానుగుణంగా వచ్చిన మార్పుల్లో సినిమా, టీవీ సీరియల్స్‌ వంటివి పుంజుకోవడంతో ఆ ప్రభావం నాటక రంగంపై పడింది. ఆంధ్రప్రదేశ్‌లో నంది నాటకోత్సవాలను ఏటా నిర్వహిస్తున్న ప్రభుత్వం ఈ రంగానికి మరింత ప్రాచుర్యం తీసుకురావాలి. ఆదాయం లేకపోవడంతోనే నాటకాలు వదిలి టీవీ, సినిమాల్లో నటించేందుకు ఇష్టపడుతున్నా రు. టీవీ సీరియళ్ళలో అశ్లీలత, ద్వందార్థాలు మితిమీరుతున్నాయనే విమర్శలున్నాయి. డబ్బే పరమావధి కాకుండా సందేశాత్మకమైన ధారా వాహికలను రూపొందిస్తే బాగుంటుంది.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.