Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Sat, 27 Oct 2018 02:54:35 IST

ఎవరెవరి ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారు!?

ఎవరెవరి ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారు!?

  • డీజీపీకి ఎన్నికల కమిషన్‌ లేఖ
  • కూటమి ఫోన్‌ ట్యాపింగ్‌ ఫిర్యాదులపై నజర్‌
  • సభలపై వివరణ కోరుతూ టీఆర్‌ఎస్‌కు లేఖ
హైదరాబాద్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నట్లు అందిన ఫిర్యాదులను ఎన్నికల కమిషన్‌ సీరియ్‌సగా పరిగణించింది. అవి అందిన మరుసటి రోజే స్పందించింది. ఫోన్‌ ట్యాపింగ్‌తోపాటు ఇతర అంశాలపై వివరణ కోరుతూ సంబంధిత వ్యవస్థలకు శుక్రవారం లేఖలు రాసింది. ‘ఫోన్‌ ట్యాపింగ్‌కు విధివిధానాలు ఏమిటి? ఎవరె వరి ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారు’’ అంటూ డీజీపీ మహేందర్‌ రెడ్డికి లేఖ రాసింది. ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారంటూ మహా కూటమి నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎల్‌.రమణ, చాడ వెంకట్‌రెడ్డి, దిలీప్‌కుమార్‌ తదితరులు గురువారం సీఈవో రజత్‌కుమార్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫోన్‌ ట్యాపింగ్‌, సీఎం-మంత్రుల క్యాంపు కార్యాలయాల్లో పార్టీ సభలు, రైళ్లలో సీఎం ఫొటోలకు సంబంఽధించి కొన్ని ఆధారాలను కూటమి నేతలు ఈసీకి సమర్పించినట్లు తెలిసింది. సీఎం, మంత్రుల క్యాంపు కార్యాలయాల్లో సమావేశాలపై పత్రికల్లో వచ్చిన కథనాలను అందజేశారు. రైళ్లలో సీఎం చిత్రాలకు సంబంధించిన ఫొటోలు కూడా సమర్పించారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై తమ అనుమానాలనే ఈసీ వద్ద వ్యక్తం చేశారు. దాంతో, ట్యాపింగ్‌పై స్పష్టత కోసం డీజీపీ వివరణను ఈసీ కోరింది. నిజానికి, ఫోన్‌ ట్యాపింగ్‌ నేరం. ఇక, మెట్రో, ఎంఎంటీఎస్‌ రైళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బొమ్మల కొనసాగింపు ఫిర్యాదుపై సంబంధిత అధికారులకు లేఖలు పంపింది.
 
మనకెందుకీ తలనొప్పి...!
ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న అంశాలపై నిర్ణయాలు తీసుకోరాదని, వాటిని ఎన్నికల కమిషన్‌కే వదిలేయాలని మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ స్ర్కీనింగ్‌ కమిటీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ‘‘ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో.. మనకెందుకీ తలనొప్పి? ఏ పథకాన్నీ ఆపొద్దు. దానిని అమలు చేయాలా వద్దా అని ఈసీకే వదిలేద్దాం’’ అని అభిప్రాయపడింది. ఈ కమిటీ గురువారం సచివాలయంలో సమావేశమైంది.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.