Dec 16 2014 @ 00:50AM

‘ఫిరంగి’ కలేనా?

నీటి మూటలుగా పాలకుల హామీలు
దశాబ్ధాలు గడచినా మరమ్మతుకు
నోచని వైనం
కబ్జా కోరల్లో కాలువలు, చెరువులు..
పట్టించుకోని పాలకులు
(ఆంధ్రజ్యోతి - చేవెళ్ల)
ఫిరంగి నాలా(కాలువ) అభివృద్ధిపై పాలకులు దశాబ్ధకా లంగా హామీలు గుప్పిస్తూనే ఉన్నారు. కానీ నేటికి నాలాకు మోక్షం కలగలేదు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబునాయుడు ఫిరంగి నాలా అభివృద్ధికి కృషి చేస్తా నని భరోసా ఇచ్చారు. ఆయన తరువాత అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన పల్లెబాట కార్యక్రమంలో ఫిరంగి కాలువ మరమ్మతులు చేపడతానని ఇచ్చిన హామీ నీటి మూటలు గానే మిగిలిపోయింది. రాష్ట్ర మాజీ హోంమంత్రి సబితా రెడ్డి కూడా ఫిరంగి నాలా పునరుద్ధరణకు ప్రతిపాదనలకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించినా ఫలి తం లేకుండాపోయింది. కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు, రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం చేవెళ్లకు తీసుకువచ్చే బదులుగా... చేవెళ్ల వ్యవసాయ డివిజన్‌ పరిధిలోని ‘ఈసీ’ నదిపై నిజాం ప్రభు వులు నిర్మించిన ‘ఫిరంగి కాలువ’కు మరమ్మతులు చేపడితే చాలని రైతులు పేర్కొంటున్నారు. ఈ కాలువకు మరమ్మ తులు చేపడితే వేలాది ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని అంచనా. అయితే ప్రస్తుతం ఈ కాలువ కబ్జాకు గురవుతోంది. భవిష్యత్‌లో ఈ కాలువ కనుమరు గయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వ భూముల పరిరక్షిస్తామని పేర్కొంటున్న సీఎం కేసీఆర్‌ కబ్జాకు గురైన ఫిరంగి నాలాపై దృష్టిసారించాలని రైతులు కోరుతున్నారు.
కాలువ చరిత్ర...
రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాలకు ఉప యోగపడేలా 1872వ సంవత్సరంలో నిజాం ప్రభువు ఫ్రెంచ్‌, ఇంగ్లీష్‌ ఇంజనీర్ల సలహాలతో కాలువ నిర్మాణాన్ని చేపట్టినట్లు చరిత్ర చెబుతోంది. షాబాద్‌ మండలం చన్‌దన వెల్లి గ్రామానికి తూర్పున చేవెళ్ల, మొయినాబాద్‌, మండ లాల సరిహద్దుల్లో ‘ఈసీ’ నదిపై సర్వే నంబర్‌ 160లో సుమారు రెండు ఫర్లాంగుల పొడవున ఈ ఆనకట్ట నిర్మిం చారు. (ఫిరంగి కాలువ ముఖద్వారం వద్ద గల శిలా ఫల కం ప్రకారం) కాలువను 48 మీటర్ల వెడల్పు, 85 కిలో మీటర్ల పొడవుతో నిర్మించారు. రాజధానికి తాగు నీటిని అందించే హిమయత్‌ సాగర్‌కు, దానికి పశ్చిమ, వాయువ్య దిశలో గల 40 నుంచి 50 గ్రామాలకు తాగు, సాగునీటిని అందించే ఉద్దేశ్యంతో దీనిని నిర్మించారు. ఈసీ నది జలాలు ఫిరంగి కాల్వ ద్వారా కుంటలు, చెరువులు కలుపుతూ ఇబ్రహీంపట్నం చెరువు వరకు నీరు ప్రవహించే విధంగా ఏర్పాటు చేశారు. సోలిపేట పెద్దచెరువు, చందనవెల్లి చెరువు, రామంజాపూర్‌ (మద్దూర్‌కుంట), పాలమాకుల చెరువు, శంషాబాద్‌ చెరువు, హయత్‌ నగర్‌ చెరువు, ఇంజాపూర్‌ చెరువు, కొత్త చెరువు (తుర్కయంజాల్‌), ఇబ్ర హీంపట్నం చెరువు, తుక్కుగూడ చెరువులపై ఆధారపడి వేలాది ఎకరాలకు సాగునీటి అందించే విధంగా అప్పటి పాలకులు నిర్మించిన ఫిరంగి కాలువ కాలగర్భంలో కలిసి పోయే స్థితికి చేరుకోంది. ఈ కాలువ నిర్మాణం వల్ల వచ్చి చేరే నీటితో అనేక గ్రామాల్లో వేలాది ఎకరాల పంటలు సాగుకు నోచుకునేది. ఒక్క ఇంజాపూర్‌ చెరువు కిందనే 1967 నాటి వరకు 721.30 ఎకారాల ఆయకట్ట భూములు సాగుకు నోచుకునేవి. అప్పటికే పూరుకుపోతున్న దీనిని 43.600 రూపాయలతో పునరుద్ధరించారు.
ఒట్టిపోతున్న చెరువులు...
బీడుగా మారుతున్న పంట పొలాలు
భవిష్యత్‌ తరాల కోసం నిజాం హయాంలో నిర్మించిన పలు చెరువులు నేడు పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాగునీటి అవసరాలు, వ్యవసాయాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని నాటి పాలకులు నిర్మించిన చెరువులు నేడు ఒట్టిపోయి బీడు భూముల్లా మారిపోతు న్నాయి. అయినా ప్రభుత్వం వాటికి మరమ్మతులు చేయ టానికి ఆసక్తి చూపించకపోగా చెరువుల పూడికలు తీయ టంలో కూడా ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. రంగా రెడ్డి జిల్లాలో 1872వ సంవత్సరంలో నిజాం ప్రభువులు నిర్మించిన ఫిరంగి కాలువ ద్వారా వేలాది ఎకరాల విస్తీ ర్ణంలో భూములు సాగుకు, లక్షలాది మంది గ్రామాల ప్రజ లకు తాగునీటిని అందించింది. అలాంటి కాలువ ఇప్పడు ఎండిపోయింది. కాలువ పొడవునా కబ్జాలు జరిగి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు వృదిచెందాయి. కానీ జిల్లాలోని ఐదు మండలాలకు అప్పట్లో నీరందించిన ఈ కాలువ ప్రస్తుతం పిచ్చిచెట్లు పెరిగి అస్తవ్యస్తంగా తయారైనా పాలకులు మాత్రం పట్టించుకోవటం లేదు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వ్యవసాయ డివిజన్‌ పరిధిలోని చందనవెల్లి వద్ద ఈ ఫిరంగి కాలువ ప్రారంభమై దాదాపు 85 కిలోమీటర్ల పొడ వునా ఇబ్రహీంపట్నం చెరువు వరకు విస్తరించింది. హయ త్‌నగర్‌, సరూర్‌నగర్‌, ఇబ్రహీంపట్నం మహేశ్వరం, శంషా బాద్‌ మండలాల్లోని దాదాపు 50 గ్రామాలలోని వేలాది పంట పొలాలను ఈ కాలువ సస్యశ్యామలం చేసింది. కాలువ పొడవునా అన్ని మండలాల్లోని పలు చెరవులకు నీటిని అందించే విధంగా కాలువ నిర్మాణం జరిగింది. ఈ కాలువ మరమ్మతులు జరిగితే పెద్ద ఎత్తున కురిసే వర్షాల వల్ల కాలువలోకి నీరు చేరి దాదాపు అన్ని చెరువులు నిండటం వల్ల రాబోయే అన్ని రోజుల్లో ఇబ్రహీం పట్నం, సరూర్‌నగర్‌, హయత్‌నగర్‌, శంషాబాద్‌, మొయినాబాద్‌ మండలాల్లో దాదాపు 50 నుంచి 60 గ్రామాలు సస్యశ్యా మలమై ప్రజల తాగునీటి అవసరాలు, వ్యవసాయానికి కూడ నీరు చేరుతుందని ఇక్కడి గ్రామాల ప్రజలు వివరి స్తున్నారు. హయత్‌నగర్‌ మండలంలో ఎగువ ప్రాంతంలో ఉన్న ఇంజాపూర్‌ చెరువుకు నీరు చేరాలంటే ఏకైక మార్గం ఫిరంగి కాలువేనని అక్కడి గ్రామాల ప్రజలు అంటున్నారు. ఈ చెరువులు నిండితే హయత్‌నగర్‌ మండలంలోని అనేక గ్రామాలకు తాగునీరు సాగునీరు లభిస్తుందని పేర్కొం టున్నారు.
కబ్జా కోరల్లో ఫిరంగి కాలువ...
అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఫిరంగి కాలువ కబ్జాకు గురవుతోంది. ఫిరంగి కాలువ పొడవునా అనేక ప్రాంతాల్లో కబ్జాలు పెరిగి పోయాయి. పెద్ద ఎత్తున రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం వృద్ధిచెందింది. దీంతో దాదాపు 30 కిలోమీటర్ల పరిధిలో కబ్జాల పర్వం కొనసాగుతుంది.. హిమాయత్‌నగర్‌ నుండి మొదలుపెడితే ఎర్రకుంట, పహాడిషరీఫ్‌, కొత్తపేట, వెంకటాపూర్‌, నాదర్‌గుల్‌లతోపాటు అనేకచోట్ల కాలువ గండి పడిపోవటంతో పాటు పెద్ద ఎత్తున కబ్జాలు పెరిగి పోవటం, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం వృద్ధికావటంతో కాలువ ఆనవాళ్లు కూడా లేకుండా తయారైంది. తుర్క యాంజల్‌లోని కొత్తచెరువు, ఇబ్రహీంపట్నం చెరువు, నాదర్‌గుల్‌లోని మన్సూర్‌ఖాన్‌ చెరువు, ఇంజాపూర్‌లోని ఇంజాపూర్‌ చెరువు, హయత్‌నగర్‌ చెరువులో అనేకచోట్ల అమ్మకాలు చేయటానికి వీలు లేని ఇన్నో ఇనామ్‌ పట్టా భూములు నేడు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల పాలయ్యాయి. దీర్గకాలిక ప్రయోజనాల కోసం నిర్మించిన ఈ కాలువ పరివాహం మొత్తం ఎండిపోయింది. ఎన్నో చోట్ల కాలువను పూడ్చి భారీ నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది. దాదాపు మూడు వందల ఎకరాల్లో ఉన్న ఇంజపూర్‌ చెరువుకి, తుర్కయాం జల్‌లో దాదాపు రెండు వందల ఎకరాల్లో ఉన్న కొత్త చెరువు, ఇబ్రహీంపట్నం చెరువు, నాగర్‌గుల్‌లోని మన్సూర్‌ ఖాన్‌ చెరువు, హయత్‌నగర్‌ చెరువుల పూడిక తీస్తే కనీసం వంద కోట్ల రూపాయల వరకు ఖర్చు కాగలదని అధికా రుల అంచనా.