Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Fri, 21 Sep 2018 13:05:01 IST

ప్రబోధానంద ఆశ్రమ వివాదం: తనిఖీల్లో ఊహకందని విషయాలు వెలుగులోకి!!

ప్రబోధానంద ఆశ్రమ వివాదం: తనిఖీల్లో ఊహకందని విషయాలు వెలుగులోకి!!

  • ఆశ్రమంలో తనిఖీలకు తాత్కాలిక విరామం
  • పూర్తి కావొచ్చిన ఇనుప కంచె ఏర్పాటు
  • నాలుగో రోజు పర్యవేక్షించిన ఎస్పీ
  • గ్రామస్థులతో సమావేశమైన త్రిసభ్య కమిటీ
  • ఆశ్రమానికి వ్యతిరేకంగా ప్రజల ఫిర్యాదు
తాడిపత్రి/అనంతపురం: జిల్లాలోని తాడిపత్రి మండలంలోని చిన్నపొలమడ, పెద్దపొలమడ గ్రామాల్లో గురువారం త్రిసభ్య కమిటీ పర్యటించింది. క మిటీలో జాయింట్‌ కలెక్టర్‌-2 సుబ్బరాజు, ఆర్డీ ఓ మలోలా, డీఎస్పీ విజయ్‌కుమార్‌లు ఉన్నారు. వారివెంట రెవెన్యూ అధికారులు ఉన్నారు. మొదట చిన్నపొలమడ గ్రామంలో కమిటీ పర్యటించింది. ఈ సందర్భంగా గ్రామస్థులతో స మావేశమైంది. గ్రామసమీపంలో ప్రబోధానంద ఆశ్రమం ఉండడం వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులు, కష్టనష్టాల గురించి సమగ్రంగా వివరిం చాలని ప్రజలను కోరింది. వారిలో నరసింహా రెడ్డి అనే వ్యక్తి మాట్లాడుతూ ఆశ్రమంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని వివరించారు. ఆశ్రమం వైపు నుంచి వెళ్లాలంటేనే భయంగా ఉందని తెలిపారు. నాగేష్‌ అనే వ్యక్తి మాట్లాడుతూ ప్రబోధానంద శిష్యులు ఉన్మాదులుగా వ్యవహరిస్తున్నారని, వారికంటే ఉగ్రవాదులు మేలని తెలిపారు.
 
నాగలక్ష్మి అనే మహిళ మాట్లాడుతూ.. ప్రబోధానంద శిష్యులకు గ్రామస్థులు కనిపించారంటే చాలు భయపట్టిస్తున్నారని, ఇక్కడి నుంచి ఆశ్రమాన్ని తరలించడమో, ఎలాంటి కార్యకలాపాలు జరగకుండా సీజ్‌ చేయడమో చేస్తే మంచిదని కోరారు. రామక్రిష్ణారెడ్డి అనే వ్యక్తి మాట్లాడుతూ నిమజ్జనం సందర్భంగా జరిగిన ఘర్షణలో అమాయకులైన అనేకమందిని ప్రబోధానంద శిష్యులు రాళ్లలు, కర్రలతో దాడిచేసి గాయపరిచారన్నారు. గ్రామంలోకి వచ్చిమరీ దాడులకు దిగారన్నారు. బీసీ కాలనీకి చెందిన తులశమ్మ మాట్లాడుతూ కాలనీకి అతి సమీపంలో ఆ శ్రమం ఉందని, ఏ చిన్న గొడవ జరిగినా శిష్యులు తమపై దాడికి దిగుతున్నారని వాపోయింది. ఇప్పటికే కాలనీలో అనేకమంది ఇళ్లకు తాళాలు వేసి బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లారని ఆవేదన వ్యక్తంచేసింది. వీరితోపాటు మరికొందరు ఆశ్రమం గురించి వ్యతిరేకంగా తెలియచేశారు. పెద్దపొలమడ గ్రామంలో కూడా త్రిసభ్య కమిటీ పర్యటించింది. స్థానికులతో సమావేశమై నిమజ్జనం సందర్భంగా చో టుచేసుకున్న పరిణామాలు, పోలీసులు వ్యవహరించిన తీరు, ప్రబోధానంద శిష్యుల దాడులు, తదితర అంశాల గురించి వివరాలడిగి తెలుసుకున్నారు. స్థానికులు చెప్పిన వివరాలన్నింటినీ నమోదు చేసుకున్నారు.
 
ప్రబోధానంద ఆశ్రమంలో ఎస్పీ అశోక్‌కు మార్‌ నాలుగో రోజు కూడా తిష్టవేశారు. వరుసగా నాలుగు రోజుల పాటు ఇక్కడే ఉంటూ పరిస్థితులను సమీక్షించారు. అప్పుడప్పుడు తాడిపత్రికి వచ్చి ఆర్‌అండ్‌బీ బంగ్లాలో విశ్రాంతి తీసుకుంటున్నారు. స్థానిక డీఎస్పీ కార్యా లయలో పోలీసు అధికారులతో సమా వేశమవుతూ తీసుకోవాల్సిన చర్యల గురించి సమీక్షిస్తున్నారు. ఆశ్రమంలో జరిగిన తని ఖీలకు సంబంధించి కూడా రెవెన్యూ అ ధికారులతో సమీక్షించారు. ఎస్పీ ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన ఇనుప ముళ్లకంచె పనులు జరుగుతున్నాయి. పనుల నత్తనడకపై ఎస్పీ సీరియస్‌ కావడంతో సిబ్బందితో పాటు కార్మికులు పనులను వేగవం తం చేశారు. ఆశ్రమం చుట్టూ గోతులు తవ్వి కట్టెలు నాటారు. కొంతవరకు ముళ్లకంచె పనులు కూడా పూర్తిచేశారు. ఒకట్రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో కంచె పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.
 
తనిఖీలకు తాత్కాలిక విరామం
రెండురోజుల పాటు ప్రబోధానంద ఆశ్రమంలో విస్తృతస్థాయిలో జరిగిన తనిఖీల కు గురువారం తాత్కాలికంగా విరామం ప్ర కటించారు. చిన్నపొలమడ, పెద్దపొలమడ గ్రా మాల్లో త్రిసభ్య కమిటీ పర్యటించి ప్రజల అ భిప్రాయాలు సేకరించారు. ఇప్పటివరకు త నిఖీల్లో కలెక్టర్‌ వీరపాండియన్‌, ఎస్పీ అ శోక్‌కుమార్‌లతో పాటు త్రిసభ్య కమిటీ సభ్యులు జాయింట్‌ కలెక్టర్‌-2 సుబ్బరాజు, ఆర్డీఓ మలోలా, డీఎస్పీ విజయ్‌కుమార్‌లతో పాటు రెవెన్యూ అధికారులు రాత్రి పగలు అనే తేడా లేకుండా నిర్విరామంగా తనిఖీలు నిర్వహించారు. ఆశ్రమంలోని ప్రతి అంశాన్ని క్షుణ్నంగా తనిఖీ చేసి వీడియో, ఫోటోల్లో నిక్షిప్తం చేశారు.
 
ఇప్పటివరకు పోలీసు, రెవెన్యూ అధికారులు జరిపిన విస్తృతస్థాయి తనిఖీల్లో కొండను తవ్వి ఎలుకను పట్టారా అన్న ప్రచారం జరుగు తోంది. ఎందుకంటే ప్రబోధానంద ఆశ్రమం అ సాంఘిక కార్యకలాపాలకు వేదికగా ఉందని, అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని, భారీ ఎత్తున మారణాయుధాలు ఉన్నాయని, ప్ర బోధానంద మరో డేరా బాబా అని సాక్షాత్తు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆరోపణలు చేయడం తో పాటు చిన్నపొలమడ, పెద్దపొలమడ గ్రా మస్థులు సైతం ఇదే అంశాన్ని ముక్తకంఠంతో వ్యక్తపరిచారు. వీటన్నింటినీ దృష్టిలో ఉం చుకొని పోలీసు, రెవెన్యూ అధికారులు భారీ బందోబస్తు మధ్య విస్తృతస్థాయిలో తనిఖీలు చేశారు. కానీ తనిఖీల ప్రారంభంలో ఉన్న ఉత్సాహం ప్రస్తుతం లేనట్లు స్పష్టమవుతోంది. వారు ఊహించిన దానికి, తనిఖీల్లో కనిపిస్తున్న వాటికి మధ్య నక్కకూ నాగలోకానికి మధ్య తేడా ఉన్నట్లు వారి మాటలను బట్టి స్పష్టమవుతోంది.
 
రెండురోజుల పాటు పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించినా ఆశించి న స్థాయిలో ఫలితాలు లేకపోవడంతో గురు వారం త్రిసభ్య కమిటీ చిన్నపొలమడ, పెద్దపొ లమడ గ్రామాల్లో పర్యటించి ఆశ్రమ కా ర్యకలాపాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడంలో నిమగ్నమైంది. రెండురోజుల పాటు ఆశ్రమం వద్ద తిష్టవేసిన కలెక్టర్‌ గురువారం ఇటువైపు రాలేదు. కేవలం ఎస్పీ మాత్రమే ఉంటూ ఇనుప ముళ్లకంచెపనులను పర్యవేక్షిస్తున్నారు. ఆశ్రమంలో పోలీసు బందోబస్తు కొనసాగుతోంది.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.