Aug 30 2018 @ 20:37PM

‘సిల్లీ ఫెలోస్’కి తలనొప్పి ఎక్కువే

భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. అల్లరి నరేష్, సునీల్ హీరోలుగా.. పూర్ణ, చిత్ర శుక్లా హీరోయిన్లుగా ఈ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
 
‘హెడేక్ రా మామ’ అంటూ సాగే ఈ సాంగ్‌లో పెంచల్ దాస్ వాయిస్ ఆకట్టుకుంటోంది. శ్రీ వసంత్ సంగీత సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సాంగ్‌ను కాసర్ల శ్యామ్ రాశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సాంగ్ విడుదలైంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంటోన్న విషయం తెలిసిందే. తాజాగా వచ్చిన ఈ ‘హెడేక్ రా మామ’ లిరిక్స్ కూడా క్యాచీగా ఉండటంతో సోషల్ మీడియాలో ఈ సాంగ్ ట్రెండింగ్ అవుతోంది.