
జహీరాబాద్, ఆగస్టు 13: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల నర్సింహారెడ్డి (92) సోమవారం కన్నుమూశారు. ఈనెల 1న అస్వస్థతకు గురైన ఆయనను హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షల అనంతరం ఆయనకు లింపో కేన్సర్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. సోమవారం పరిస్థితి విషమించడంతో.. ఆయన తుదిశ్వాస విడిచారు. మృతదేహాన్ని ఆయన స్వస్థలమైన కోహీర్ మండలం పీచేరాగడికి తీసుకువెళ్లినట్లు.. మంగళవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.