Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Thu, 31 May 2018 01:01:43 IST

విశిష్ట పురస్కారాలు

విశిష్ట  పురస్కారాలు

  • నేరెళ్ల, రవ్వా శ్రీహరి, ఆదిరాజుకు విశిష్ట  పురస్కారాలు
  • 48 మందికి రాష్ట్రావతరణ అవార్డులు
  • ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
  • రాష్ట్రావతరణ వేడుక నాడు ప్రదానం
  • ‘ఆంధ్రజ్యోతి’లో ఇద్దరికి అవార్డులు

హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రముఖులకు ప్రభుత్వం రాష్ట్రస్థాయి అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన వారిని 2018 సంవత్సరానికి గాను ఎంపిక చేసింది. 27 కేటగిరీల్లో 48 మందికి అవార్డులు ప్రకటించింది. వీరిలో అనుపమాన సేవలు అందించినందుకు మిమిక్రీ ఆర్టిస్టు నేరెళ్ల వేణుమాధవ్‌, మహామహోపాధ్యాయ, సంస్కృత పండితుడు రవ్వా శ్రీహరి, 1969 తెలంగాణ ఉద్యమకారుడు ఆదిరాజు వెంకటేశ్వరరావులకు ‘అవుట్‌ స్టాండింగ్‌ కాంట్రిబ్యూషన్‌’ అవార్డు ప్రకటించింది. ఇక, ‘ఆంధ్రజ్యోతి’లో ఇద్దరు జర్నలిస్టులకు ప్రభుత్వం పురస్కారాలను ప్రకటించింది. జూన్‌ రెండో తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అవార్డులను ప్రదానం చేయనుంది. అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి లక్షా నూట పదహారు రూపాయల చెక్కును అందించనుంది.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.