Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Sun, 20 May 2018 12:07:43 IST

తెలుగులోనూ తళుక్కుమన్న రాధికాకుమారస్వామి

తెలుగులోనూ తళుక్కుమన్న రాధికాకుమారస్వామి

బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న కుమారస్వామి భార్య రాధికా కుమార స్వామి కన్నడ నటి అనే విషయం తెలిసిందే! అయితే రాధిక అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ కూడా నటించారు. 2014లో కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అవతారం సినిమాలో రాధికా కుమారస్వామి, భానుప్రియ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలో రాధికాకుమారస్వామి భక్తురాలు రాజేశ్వరి పాత్ర పోషించారు. భానుప్రియ అక్కమ్మ దేవత పాత్రలో కనిపించారు. ఈ సినిమాను హిందీ డబ్బింగ్ వెర్షన్‌లో ‘ది పవర్ అవతారం’ పేరిట విడుదల చేశారు. అంతకుముందు 2004లో నందమూరి తారకత్న సరసన ‘భద్రాద్రి రాముడు’ సినిమాలో రాధిక హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో తారకరత్న ‘రాముడు’ పాత్ర పోషింగా, రాధిక ‘సీత’ పాత్రలో కనిపించారు.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.