Apr 11 2018 @ 19:20PM

శివాలయాన్ని అపవిత్రం చేసిన ఆకతాయిలు

అనకాపల్లి: విశాఖ జిల్లా అనకాపల్లిలోని పిసినికాడ గ్రామంలో ఆకతాయిలు రెచ్చిపోయారు. వింత చేష్టలతో శివాలయాన్ని అపవిత్రం చేశారు. పిచ్చి ప్రవర్తనతో గ్రామస్తులకు ఆగ్రహం తెప్పించారు. చివరకు సహించలేని స్థానికులు పోలీసులకు పిర్యాదు చేశారు. ఆకతాయిల ప్రవర్తనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అనకాపల్లి పిసినికాడ గ్రామ పొలాల్లో శివాలయం ఉంది. నిత్యం ఇక్కడ పూజలు జరుగుతుంటాయి. పవిత్రంగా భావించే దేవాలయాన్ని కొందరు ఆకతాయిలు అపవిత్రం చేశారు. నంది విగ్రహంపై నిలబడి కాళ్లు కడిగారు. తులసి చెట్టుపై మూత్రం పోశారు. ఇంతటితో ఆగని ఆకతాయిలు అర్చనకు వాడే పూజ సామాగ్రిని అపవిత్రం చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.