Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Mon, 02 Apr 2018 15:06:09 IST

భార్య మరణిస్తే ఆయన్నే చంపేశారు...!

భార్య మరణిస్తే ఆయన్నే చంపేశారు...!

చెన్నై: టీఎన్ శేషన్ పేరు చెబితే కొన్నేళ్ల క్రితం రాజకీయ పార్టీల గుండెల్లో ఎన్నికల సంస్కరణల ద్వారా గుబులు పుట్టించిన ఫైర్‌బ్రాండ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టీఎన్ శేషన్ గుర్తుకొస్తారు. అత్యుత్సాహం కారణంగానో, వార్తలు నిర్ధారణ చేసుకోకపోవడం వల్లనో కానీ టీఎన్ శేషన్ కన్నుమూశారంటూ సోషల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. కొన్ని న్యూస్ నెట్‌వర్క్‌లూ సైతం అదే బాట పట్టాయి. దీంతో ఆయన మృతికి నివాళులు, సంతాప సందేశాలు కూడా వెల్లువెత్తాయి. అయితే ఆ వార్త అబద్ధమని తెలిసి ఆ తర్వాత నాలుక కరుచుకున్నాయి. తిరిగి సోషల్ నెట్‌వర్క్‌లో క్షమాపణల పర్వం మొదలైంది. ఇంతకూ అసలు విషయం ఏమిటంటే...గత శనివారంనాడు సేషన్ భార్య జయలక్ష్మి శేషన్ కన్నుమాశారు.
 
జయలక్ష్మీ శేషన్ మరణించిన విషయాన్ని శేషన్ సన్నిహితులు ధ్రువీకరించారు. ఈ లోపలో జయలక్ష్మికి బదులు శేషన్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. దీంతో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళులు వెల్లువెత్తాయి. అయితే కొద్ది సేపటికే శేషన్ చనిపోయిన వార్తలను ఆయన సన్నిహితులు ఖండించారు. ఆయన క్షేమంగానే ఉన్నారని, 31వ తేదీ ఉదయం 11.55 గంటలకు శేషన్ సతీమణి జయలక్ష్మి చనిపోయారంటూ ఆమె ఫోటోను కూడా పోస్ట్ చేశారు.
 
శేషన్ దంపతులను ఆదర్శ దంపతులుగా సన్నిహితులు చెబుతుంటారు. వారికి పిల్లలు లేరు. దాంతో చాలాకాలంగా వారు వృద్ధాశ్రమంలో శేషజీవితం గడుపుతున్నారు. తమిళనాడు 1955 ఐఎఎస్ క్యాడర్ అధికారి అయిన శేషన్ 10వ భారత ఎన్నికల ప్రధానాధికారిగా 1990 నుంచి 96 వరకూ సేవలందించారు. ఎన్నికల్లో అవకతవకలను నిరోధించేందుకు ఎంతో సాహసోపేతమైన సంస్కరణలు చేపట్టిన క్రెడిట్ దక్కించుకున్నారు. 1996లో రామన్ మెగసెసే అవార్డును ఆయన అందుకున్నారు.
 
శేషన్ పిల్లలు లేని కారణంగా కొద్దికాలంగా తన భార్యతో సహా వృద్ధాశ్రమంలోనే నివసిస్తూ వచ్చారు. పుట్టపర్తి సత్యసాయి బాబాకు భక్తుడైన శేషన్ కొద్దికాలం క్రితం సత్యసాయి బాబా శివైక్యం చెందడతో తీవ్ర మనస్తాపం చెందారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించిందని, జ్ఞాపకశక్తి బాగా తగ్గిదంటూ వార్తలు వచ్చారు. గత ఏడాది డిసెంబర్ 15న ఆయన వృద్ధాశ్రమంలోనే 85వ పుట్టినరోజు జరుపుకొన్నారు. కాగా, ఇంతకాలం తనకు తోడునీడగా ఉన్న జయలక్ష్మి సైతం ఇప్పుడు ఆయనను ఒంటరిని చేసి తిరుగురాని లోకానికి తిరిగి వెళ్లడం విచారకరమని శేషన్ సన్నిహితులు చెబుతున్నారు.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.