Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Sat, 24 Mar 2018 03:44:27 IST

ఐదుగురికి కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యత్వం

ఐదుగురికి కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యత్వం

  • తెలుగు విభాగ సలహా మండలిలో చోటు
హైదరాబాద్‌ సిటీ/ఖమ్మం ఎడ్యుకేషన్‌/యానాం(ఆంధ్రజ్యోతి): కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగ సలహామండలి సభ్యులుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు సాహితీవేత్తలు నియమితులయ్యారు. శుక్రవారం ఆ సంస్థ జాతీయ కార్యదర్శి కె. శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ నుంచి ప్రముఖ నవలా రచయిత ‘అంపశయ్య’ నవీన్‌, కవిసంగమం వ్యవస్థాపకులు, కవి యాకూబ్‌, రాయలసీమ నుంచి ఎస్వీ యూనివర్సిటీ ఆచార్యులు ప్రముఖ కథా రచయిత్రి కొలకలూరి మధుజ్యోతి, ఉత్తరాంధ్ర ప్రముఖ కథకుడు అట్టాడ అప్పలనాయుడు, యానాంకు చెందిన ప్రముఖ కవి శిఖామణి సభ్యులుగా నియమితులయ్యారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అయిన నవీన్‌ పాతికపైగా నవలలు, కథలు రాశారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రొట్టమాకురేవు గ్రామానికి చెందిన కవి డాక్టర్‌ షేక్‌ యాకూబ్‌ హైదరాబాద్‌లోని గోల్కొండ మహిళా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో తెలుగు ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన పలు కవితా సంపుటాలు, గ్రంథాలు రచించారు. యాకూబ్‌ ఆరేళ్లుగా ‘కవి సంగమం’ అనే కవిత్వ వేదికను నిర్వహిస్తున్నారు. తనను కేంద్ర సాహిత్య అకాడమీకి ఎంపిక చేయడం వల్ల యానాంకే కాకుండా తూర్పు గోదావరి జిల్లాలోని సాహిత్యానికి గొప్ప ప్రాచుర్యం వస్తుందని శిఖామణి అన్నారు.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.