Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Tue, 13 Mar 2018 00:24:05 IST

వైద్య విధాన పరిషత్‌ ఉద్యోగుల విభజన

వైద్య విధాన పరిషత్‌ ఉద్యోగుల విభజన

  •  వారాల్లో ప్రక్రియ పూర్తి చేయాలి: హైకోర్టు ఆదేశం
హైదరాబాద్‌, మార్చి 12(ఆంధ్రజ్యోతి): ఏపీ పునర్విభజన చట్టం నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ వైద్య విధాన పరిషత్తు ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు రెండు ప్రభుత్వాలను ఆదేశించింది. విధి విధానాలను 4వారాల్లో, విభజన ప్రక్రియను 8 వారాల్లో పూర్తి చేయాలని ఇరురాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖలకు ఉత్తర్వులు జారీచేసింది. ఏసీజే రమేశ్‌ రంగనాథన్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఆదేశిచింది, విభజన ప్రక్రియ పూర్తి చేయకపోవడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను ధర్మాసనం విచారించింది. నగరంలోని కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్‌ ఎస్‌.సుజాత, డిప్యూటీ కమిషనర్‌గా పదవీ విరమణ చేసిన డాక్టర్‌ సుబ్బరాములు వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.