Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Wed, 17 Jan 2018 16:39:33 IST

సినీ నటి అపూర్వ చెప్పిన ముచ్చట్లు

సినీ నటి అపూర్వ చెప్పిన ముచ్చట్లు

  • పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర చేస్తా: సినీ నటి అపూర్వ
దెందులూరు(పశ్చిమ గోదావరి జిల్లా): ప్రేక్షకుల మనసులో చిరకాలం నిలిచిపోయే పాత్రలతోపాటు నిజాయితీ గల పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర చేయాలనేదే తన కోరిక అని ప్రముఖ సినీ క్యారెక్టర్‌ ఆర్టిస్టు, హీరోయిన్‌ కె.అపూర్వ తెలిపారు. సంక్రాంతి సందర్భంగా అపూర్వ తన కుమార్తెతో కలిసి స్వగ్రామం దెందులూరు చేరుకున్నారు. ప్రతీ సంవత్సరం తల్లిదండ్రులతో కలిసి సంక్రాంతి పండను చేసుకుంటానన్నారు.
 
ఈ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. 2000లో ‘అసలు ఏం జరిగింది’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించినా పలు కారణాలతో ఆ సినిమా విడుదల కాలేదన్నారు. 2001లో అల్లరి సినిమాతో మంచి పేరు వచ్చిందన్నారు. తనకు నచ్చిన హీరో మహేశ్‌ బాబు కాగా, హీరోయిన్‌ అనుష్క అని, హీరోయిన్‌ టాబు తనకు సినీ పరిశ్రమలో అత్యంత మంచి స్నేహితురాలు అన్నారు.
 
కెవ్వు కేక, అల్లరి, సీమటపాకాయ్‌, పుట్టింటికిరా చెల్లి, జానకీ వెడ్స్‌ శ్రీరామ్‌, రెడీ వంటి సూపర్‌ హిట్‌ సినిమాల్లో సుమారు 100 చిత్రాల్లో నటించినట్లు వివరించారు. ప్రస్తుతం మేరా భారత్‌ మహాన్‌, గోలీషోడాతోపాటు మొత్తం నాలుగు సినిమాల్లో నటిస్తున్నానని తెలిపారు. తను పుట్టిన గ్రామం దెందులూరు అంటే తనకు ప్రత్యేక అభిమానం అన్నారు. ప్రతీ సంవత్సరం సంక్రాంతికి దెందులూరు వచ్చి కుటుంబ సభ్యులతో గడుపుతానని, పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నానని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని, విద్య, వైద్యం, మౌలిక వసతులపై ప్రత్యేకంగా తన వంతుగా సేవా కార్యక్రమాలు చేసే ఆలోచనలో ఉన్నానని వివరించారు. ప్రస్తుతానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులులేవని, మంచి సినిమాలతోపాటు ఐపీఎస్‌ పాత్రలో నటించి తన కోరిక తీర్చుకుంటానని ఆమె తెలిపారు.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.