Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Mon, 25 Dec 2017 18:38:26 IST

‘బటర్ ఫ్లైస్’ అంతా ఆడవాళ్లే..

బటర్ ఫ్లైస్ అంతా ఆడవాళ్లే..

నిర్మాతగా వంద చిత్రాలకు చెరువవుతున్నారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ. తన భీమవరం టాకీస్‌‌పై 92వ చిత్రంగా ‘బటర్ ఫ్లైస్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు‌. కె. ఫణిరాజ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో అందరూ ఆడవాళ్లే నటిస్తుండటం విశేషం. జ్యోత్స్న శర్మ, హర్షిణి, మేఘనా రామి, రోజా భారతి తదితరులు లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. సినీయర్ రాజకీయ నాయకులు రోశయ్య ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
 
ఈ సందర్బంగా రోశయ్య మాట్లాడుతూ.‌. ‘‘రామ సత్యనారాయణ సినిమా అంటే ప్యాషన్ ఉన్న వ్యక్తి. వంద సినిమాలకు చేరువయ్యారు. అందరూ ఆడవాళ్లతో చేస్తోన్న ఈ చిత్రం ఓ మంచి ప్రయోగం. ఇలాగే సక్సెస్ ఫుల్ సినిమాలను చేయాలని ఆశిస్తున్నానన్నారు‌’’.
 
రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ‘‘సినిమా చిత్రీకరణ పూర్తయింది. జనవరి 26న విడుదల చేస్తాము. రోశయ్య గారు ఫస్ట్ లుక్‌ను విడుదల చేయటం ఆనందంగా ఉందన్నారు‌. అందరూ ఆడవాళ్లే నటిస్తోన్న ఈ చిత్రం ఆడియన్స్‌ని తప్పకుండా ఆకట్టుకుంటుందన్నారు’’.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.