Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Sat, 09 Dec 2017 10:26:40 IST

తొలి తెలుగు వెలుగు

తొలి తెలుగు వెలుగు

‘‘మధుర మధురమైన మన భాష కంటెను...  చక్కనైన భాష జగతి లేదు తల్లి పాలకంటె తనయులకే పాలు.. బలమునీయ గలవు తెలుగు బిడ్డ’’
 
హైదరాబాద్‌ సిటీ:  తెలుగు భాష, సంస్కృతుల మీద ప్రేమాభిమానాలు కలిగిన కొంతమంది సాహితీవేత్తలు 1960ల్లోనే ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని తలంచారు. కానీ.. అవి కార్యరూపం దాల్చలేదు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో 1974, మార్చి 24 నుంచి వారం రోజుల పాటు నిజాం కళాశాల మైదానంలో అఖిల భారత తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు జరిగాయి. ఆ సందర్భంలో నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రసంగిస్తూ..‘‘తెలుగును తాలూకా స్థాయిలో అధికార భాషగా ప్రవేశపెడుతున్నట్లు’’ ప్రకటించారు. ఆ తర్వాత సాంస్కృతిక వ్యవహారాల పర్యవేక్షణకు సచివాలయంలో ప్రత్యేకించి ఓ విభాగాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం హైదరాబాద్‌ వేదికగా 1975, ఏప్రిల్‌ 12 (ఉగాది పర్వదినం) నుంచి 18 వరకు తొలి ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించారు.
 
ఊరేగింపు
నాటి తెలుగు మహాసభలకు 16 దేశాల నుంచి 92 మంది అతిథులు, తెలుగు ప్రతినిధులు హాజరయ్యారు. ఇతర రాష్ట్రాల నుంచి 981 మంది సాహితీవేత్తలు విచ్చేశారు. తెలుగు ప్రాంతాల నుంచి 4,489 మంది భాషాభిమానులు పాల్గొన్నారు. సభల ప్రారంభోత్సవం రోజున చార్మినార్‌ నుంచి ఎల్బీ స్డేడియం వరకు అశేష జనవాహినితో భారీ ఊరేగింపు నిర్వహించారు. జనవాహిని మఽధ్య నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఓపెన్‌టాప్‌ జీప్‌లో ఊరేగింపుగా మహాసభల నిర్వహణ ప్రాంగణానికి చేరుకున్నారు. నాటి ఉపరాష్ట్రపతి బి.డి జెట్టి తెలుగు ప్రసంగాన్ని కన్నడ లిపిలో రాసుకొని చదివారు. ప్రముఖ చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు రూపొందించిన తెలుగుతల్లి చిత్రపటం చెంత, జ్యోతి ప్రజ్వలనతో మహాసభలు ప్రారంభమయ్యాయి. సభలకు అధ్యక్షులుగా జలగం వెంగళరావు, కార్యనిర్వాహక అధ్యక్షులుగా మండలి వెంకట కృష్ణారావు వ్యవహరించారు.
 
స్వాగతం... సుస్వాగతం..
తెలుగు నాట ఉద్భవించిన భాషా, సంస్కృతులు, చరిత్ర, కళల వైభవాన్ని చాటి చెబుతూ నగరవ్యాప్తంగా ప్రపంచ తెలుగు మహాసభల స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. రాజుల కాలం నాటి శిల్పకళను, తెలుగు సంస్కృతి వైభవానికి ప్రతిరూపాల్లా స్వాగత ద్వారాలను రూపొందించారు. తొలి మహాసభలకు బషీర్‌బాగ్‌లోని ఎల్బీ స్టేడియం ప్రధాన వేదిక. సభాస్థలి ప్రవేశ ద్వారాలకు అల్లసాని పెద్దన్న, పోతన వంటి ప్రసిద్ధ కవుల పేర్లను పెట్టారు. సభాప్రాంగణం మొత్తం తెలుగు తేజం కందుకూరి, గురజాడ, గిడుగుతో పాటు ప్రాచీన, ఆధునిక తెలు గు యశోమూర్తుల నిలువెత్తు చిత్రపటాలను ఏర్పాటుచేశారు. సభ ప్ర ధాన నిర్వహణ ప్రాంగణాన్ని ‘‘కాకతీయ నగరం’’ పేరిట తీర్చిదిద్దారు. సదస్సులు జరిగే వేదికలకు ‘‘నాగార్జున పీఠం’’, సాంస్కృతిక కార్యక్రమాల వేదికకు ‘‘శ్రీకృష్ణ దేవరాయల దర్బారు’’గా నామకరణం చేశారు.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.