Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Sat, 25 Nov 2017 05:30:42 IST

మీగడ రామలింగస్వామికి లోక్‌నాయక్‌ పురస్కారం

మీగడ రామలింగస్వామికి లోక్‌నాయక్‌ పురస్కారం

విశాఖపట్నం: లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ వార్షిక సాహిత్య పురస్కారానికి 2017 సంవత్సరానికిగాను ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు డాక్టర్‌ మీగడ రామలింగస్వామిని ఎంపిక చేసినట్టు ఫౌండేషన్‌ అధ్యక్షుడు, పద్మభూషణ్‌ డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తెలిపారు. విశాఖపట్నం లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..స్వర్గీయ ఎన్‌.టి.రామారావు, స్వర్గీయ హరివంశరాయ్‌బచ్చన్‌ల వర్థంతి సందర్భంగా ఈ పురస్కారం ప్రదానం చేస్తున్నట్టు వెల్లడించారు.
 
వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన మద్దిలపాలెం కళాభారతిలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారం కింద రూ.లక్షా 50 వేల నగదుతో పాటు జ్ఞాపికను అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో జన్మించిన రామలింగస్వామి నాటక రంగ అభివృద్ధికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.