Oct 28 2017 @ 04:59AM

స్వాతంత్య్ర సమరయోధుడు ప్రత్తి శేషయ్య కన్నుమూత

తాడేపల్లిగూడెం టౌన్‌, అక్టోబరు 27 : ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ప్రత్తి శేషయ్య శుక్రవారం తెల్లవారుజామున మరణించారు. ఆయనకు 92 సంవత్సరాలు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరంలో రాఘవయ్య, సీలమ్మ దంపతులకు 1925లో శేషయ్య జన్మించారు. విద్యార్థి దశ నుంచే ఆయన పోరాటాల్లో పాల్గొన్నారు. మహాత్ముడి పిలుపు మేరకు జంతు వధని ఆపాలని, దళితుల ఆలయ ప్రవేశంపై విధించిన నిషే ధం తొలగించాలంటూ పోరాడారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని మూడుసార్లు జైలు శిక్ష అనుభవించారు. విశాఖ ఉద్యమం, గ్రంథాలయోద్యమంలో శేషయ్య కీలక పాత్ర పోషించారు. 1949లో మణెమ్మను వివాహం చేసుకున్నారు.