
హైదరాబాద్ : ఆన్లైన్లో విద్యుత్ బిల్లులు చెల్లించేవారి సంఖ్య పెంచుకునే దిశ లో ఎస్పీడీసీఎల్ అధి కారులు చర్యలు తీసు కుంటున్నారు. విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు ఈ సేవా కేంద్రాలు, బిల్కౌంటర్లలో గంటల కొద్ది క్యూ లైన్లలో నిలబడకుండా ఆన్లైన్లో సులువుగా చెల్లించే మార్గాలపై తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ టెక్నికల్(ఐటీ) విభాగం అధికారులు దృష్టి సారించారు. డిస్కం పరిధిలో జోన్లు, సర్కిళ్ల సంఖ్య పెరగడంతో ఆన్లైన్లో విద్యుత్ బిల్లు లు చెల్లిస్తున్న వినియోగదారులు మారిన జోన్లు, సర్కిళ్ల పేర్లతో గందరగో ళానికి గురవుతున్నారు. జోన్లు, సర్కిళ్ల పేర్లతో సంబంధం లేకుండా కేవలం యూనిక్ సర్వీస్ నంబర్‌తో ఆన్లైన్లో బిల్లు చెల్లించే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. నగరంలో ఆన్లైన్లో బిల్లులు చెల్లించే వినియోగదారుల సంఖ్య పెరిగితే ప్రతి నెలా రెండోవారంలోనే 70 శాతం బిల్లులు వసూలయ్యే అవకా శాలుంటాయని అంచనా వేస్తున్నారు.
యూనిక్ సర్వీస్ నంబర్‌తో బిల్లు చెల్లింపులు
విద్యుత్ బిల్లుపై ఉన్న యూఎస్సీ (యూనిక్ సర్వీస్) నంబర్‌తో విద్యుత్ బిల్లులు తెలుసుకోవడంతో పాటు చెల్లింపులు జరిపే విధానాన్ని ఎ స్పీడీసీఎల్ వైబ్సైట్లో డిస్కం అందుబాటులోకి తీసుకువచ్చింది. తొ మ్మిది అంకెలున్న యూఎస్సీ నంబర్ ప్రామాణికంగా ఆన్లైన్లో విద్యు త బిల్లులు చెల్లించే సౌకర్యాన్ని విద్యుత్ వినియోగదారులకు అందుబా టులోకి తీసుకువచ్చారు. వైబ్సైట్లో ఎడమవైపు ఉ న్న ఫిర్యాదుల రిజిస్ట్రేషన్ లింక్‌తో కనెక్డెడ్ లోడ్ తగ్గింపు, పేరు మార్పు, కేటగిరీ మార్పు, చిరునామా మార్పు వంటి సదుపాయాలు ఆన్లైన్లో పొందే అవకాశాలున్నాయని ఎస్పీపీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలి పారు. కొత్త కనెక్షన్లు తీసుకోవాలన్నా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే రెండు రోజుల్లో విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు.