Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Fri, 08 Sep 2017 22:34:49 IST

మార్కుల విశ్లేషణకూ ఓ టెక్నిక్‌

మార్కుల విశ్లేషణకూ ఓ టెక్నిక్‌

పరీక్షలో ఒక విద్యార్థికి 52 మార్కులు వచ్చాయి. సరే, మరి తతిమా 48 మార్కులు ఎందుకు రాలేదు అన్నది వెంటనే కలగాల్సిన సందేహం. ఎక్కడ వీక్‌గా ఉన్నారో తెలిస్తే సవరించుకోవచ్చు. తద్వారా మార్కులను పెంచుకోవచ్చు. దీన్ని టెక్నాలజీ సహకారంతో విద్యార్థి ప్రతిభను విశ్లేషించే పనిని చేపట్టిన సంస్థ ఎగ్నిఫై. ఇదో ఎడ్యు స్టార్టప్‌. దీన్ని 2015 డిసెంబర్‌లో ప్రారంభించారు. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేసి, అమెరికాలో గూగుల్‌లో పని చేసిన అనుభవం ఉన్న కిరణ్‌ బాబు దీనికి ఫౌండర్‌ అండ్‌ సిఇఓగా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు ఒక విద్యార్థికి మేథ్స్‌లో వచ్చిన మార్కులను బట్టి తను ఎందులో స్ట్రాంగ్‌ మరెందులో వీక్‌ అనే విశ్లేషణ చేయడం ఈ స్టార్టప్‌ విధి. ఈ విశ్లేషణ అటు టీచర్‌కు ఇటు పేరెంట్‌కు ఉపకరిస్తుంది. తద్వారా ప్రతి విద్యార్థి మీద వ్యక్తిగత దృష్టి కేంద్రీకరణకు అవకాశం ఉంటుంది. టీచర్లు కూడా తమ పనితీరును మెరుగుపరుచు కునేందుకు కావల్సిన అనాలిసిస్‌ను కూడా వీరు అందిస్తారు. ఇప్పటి వరకు స్కూల్స్‌కే పరిమితమైన ఈ సంస్థ తమ సేవలను ఐఐటి-జేఈఈ వంటి కాంపిటేటివ్‌ పరీక్షలకు కూడా విస్తరించే ప్రయత్నంలో ఉంది. ఈ సంస్థకు నాలుగు రాష్ర్టాల్లో దాదాపుగా మూడు లక్షల ఇరవై వేల మంది విద్యార్థులు, 28 వేల టీచర్లు, 400 స్కూల్స్‌ క్లయింట్స్‌గా ఉన్నాయి. మన కార్పొరేట్‌ కాలేజీలన్నీ ఈ సంస్థ కస్టమర్లే. వివిధ విద్యా సంస్థలకు చేరువ అయ్యే క్రమంలో ఇప్పటికే అయిన ఖర్చులను రాబట్టుకునే స్థితికి ఈ సంస్థ చేరుకుంది. ఈ సంస్థ ఇటీవలే టి-హబ్‌ సహకారంతో కొటీ అరవై లక్షల ఫండ్‌ను సమకూర్చుకోగలిగింది.
వెబ్‌సైట్‌: www.egnify.com

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.