Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Tue, 04 Nov 2014 20:54:27 IST

స్త్రీ లలో రుతుచక్ర సమస్యలు

స్త్రీ లలో రుతుచక్ర సమస్యలు

అమినోరియా: స్ర్తీలలో రుతుక్రమం రాకపోవడాన్ని అమినోరియా అంటారు. ఇది రెండు రకాలు
1. ప్రైమరీ అమినోరియా: అనగా స్ర్తీలు యుక్త వయసుకు వచ్చినప్పటికీ అనగా 16 సంవత్సరాలు తరువాత కూడా రుతుచక్రం ప్రారంభం కాకపోవడాన్ని ప్రైమరీ అమినోరియా అంటారు
కారణాలు: క్రోమోజోమల్‌ లేదా జన్యుపరమైన సమస్యలు ముఖ్యంగా టర్నర్స్‌ సిండ్రోమ్‌, గర్భాశయ నిర్మాణలోపాలు, గర్భాశయ ఇన్‌ఫెక్షన్లు, సిస్టిక్‌ ఫైబ్రోసిస్‌, కుషింగ్స్‌ సిండ్రోమ్‌ వంటి సమస్యలు
హార్మోన్‌ అసమతుల్యతలు ముఖ్యంగా ఎడ్రినల్‌ గ్రంధి సమస్యలు, కేన్సర్‌ నివారణ మాత్రలు, ఆంటీ డిప్రెసివ్‌ మాత్రలు కారణమవుతాయి.
2. సెకండరీ అమినోరియా: బహిష్టు ప్రక్రియ సక్రమంగా ఉండి, సంతానోత్పత్తి దశ లో మాత్రం స్ర్తీలలో 3 నెలల వరకు బహిష్టు కాకపోవడాన్ని సెకండరీ అమినోరియా అంటారు.
కారణాలు: పిల్లలకు పాలు ఇచ్చే సమయంలో తల్లికి నెలసరి రాదు. దీనికోసం ఎలాంటి ట్రీట్‌మెంట్‌ అవసరం లేదు. పిట్యూటరీ గ్రంధి, థైరాయిడ్‌ సమస్యలు, గర్భనిరోదక మాత్రలు, కొన్ని రకాల ఆంటి డిప్రెషన్‌ మందులు వాడటం, పీసీఓడీ(పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ డిసీజ్‌), శక్తికి మించి వ్యాయామం చేయడం, ఎక్కువ సార్లు డి్క్షసి చేయడం, గర్భ సంబంధిత ఆపరేషన్లు.
ఆలిగోమెనోరియా: రుతుచక్రం 35-40 రోజుల కంటే ఎక్కువ రోజులకు రుతుస్రావం రావడం లేదా నెలసరి సమయంలో 30మిల్లిలీటర్ల కంటే తక్కువ రుతుస్రావం కావడాన్ని అలిగోమెనోరియా అంటారు.
కారణాలు: పీసీఓడీ, పిట్యుటరీ గ్రంధిలో కణతులు ఏర్పడటం, నెలసరి ఆగిపోయే సమయంలోనూ వచ్చే అవకాశం ఉంది.
మెట్రోరేజియా: రెండు రుతుచక్రాల మఽధ్యలో రుతుస్రావం కనబడటాన్ని మెట్రోరెజియో అంటారు. ముఖ్యంగా అండం విడుదల సమయంలో ఈ మెట్రోరేజియో కనిపించే అవకాశం ఉంది.
కారణాలు: అడినోమస్‌, ఎండోమెట్రియాసిస్‌, ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ, హార్మోన్ల అసమతుల్యత, గర్భ నిరోధక పరికరాలు (ఐయూడీ), గర్భనిరోధక మాత్రల వల్ల కూడా మెట్రోరెజియో ఉంటుంది.
మెనోరేజియా: సాధారణం కంటే ఎక్కువ రోజులు రుతుస్రావం కావడాన్ని మెనోరేజియో అంటారు
కారణాలు: గర్భాశయంలో క ణుతులు, పీసీఓడీ
థైరాయిడ్‌ సమస్యలు, ఎండోమెట్రియాసిస్‌, గర్భాశయంలో కేన్సర్‌ వంటి కారణాలు మెనోరేజియాకు దారి తీస్తాయి
డిస్మెనోరియా: సీ్త్ర సాధారణ దినచర్యలను ప్రభావితం చేసేంతటి తీవ్రమైన పొత్తికడుపు నొప్పి నెలసరి సమయంలో రావడాన్ని డిస్మెనోరియా అంటారు. ఇది నెలసరికి కొద్ది రోజుల ముందు కానీ లేదా నెలసరి ప్రారంభమైన మొదటి రోజు నుంచి 3 రోజుల వరకు ఉండవచ్చు
కారణాలు: ఎండోమెట్రియోసిస్‌, గర్భసంచికలో కణుతులు, అండాశయంలో నీటి తిత్తులు ఏర్పడటం, హార్మోన్‌ అసమతుల్యతలు
నిర్ధారణ పరీక్షలు: రక్త పరీక్షలు - సీబీపీ, ఈఎస్‌ఆర్‌, హార్మోన్‌ పరీక్షలు- ఎఫ్‌ఎస్‌హెచ్‌, ఎల్‌హెచ్‌, ఎస్‌ ప్రోలాక్టిన్‌, థైరాయిడ్‌ ప్రోఫిక్‌, అలా్ట్రసౌండ్‌, సిటి స్కాన్‌ అబ్డామిన్‌ ద్వారా రుతుచక్ర సమస్యలకు గల కారణాన్ని గుర్తించవచ్చు.

హోమియోకేర్‌ వైద్యం: హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ జెనటిక్‌ కాన్స్‌టిట్యూషనల్‌ పద్ధతిలో జరుపబడే చికిత్స ద్వారా రుతుచక్ర సమస్యలకు మూల కారణమైన హార్మోన్ల అసమతుల్యతను, పీసీఓడీ, గర్భాశయంలోని ఇతర సమస్యలను సరిచేసి, గర్భాశయం ఆరోగ్యంగా ఉండేలా చేసి రుతుచక్ర సమస్యలు సంపూర్ణంగా, ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా దూరం చేయవచ్చు.
డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లవార్‌ (సీఎండీ)
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ ప్ర్తె.లి.
ఫోన్‌ : 9550001199/88
టోల్‌ ఫ్రీ : 1800 102 2202

 
 

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.