Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Sat, 20 May 2017 03:05:48 IST

‘దేవుని ముద్ర’తో ఉద్రిక్తం!

దేవుని ముద్రతో ఉద్రిక్తం!

  • ఖురాన్‌పై అనుచిత వ్యాఖ్యలు
  • ప్రబోధానందపై ముస్లింల ఆగ్రహం
  • 2 వేల మందితో ర్యాలీగా స్టేషన్‌కు
తాడిపత్రి, మే 19: త్రైత సిద్ధాంత వ్యవస్థాపకుడు ప్రబోధానందస్వామి రాసిన ‘దేవుని ముద్ర’ పుస్తకంలో ఖురానపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ముస్లింలు మండిపడ్డారు. ఆ పుస్తకాన్ని వెంటనే నిషేధించి.. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం సుమారు రెండువేల మంది ముస్లింలు ర్యాలీగా పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. ప్రభుత్వ ఖాజీ అబ్దుల్‌ హైఖాద్రి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పోలీసులకు అందించారు.
 
‘‘ప్రబోధానంద స్వామి రాసిన పుస్తకంలో ఖురాన, మహమ్మద్‌ ప్రవక్త గురించి, ఇస్లాం ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలు ముస్లింల మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయి. ఆ పుస్తకాన్ని నిలిపివేయాలి. భవిష్యత్తులో ఇస్లాం గురించి అవగాహనాలేమితో పుస్తకాలు రాయకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’’ అని కోరారు. పలువురు ముస్లిం పెదద్దలు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డిని కూడా కలిసి ప్రబోధానందపై ఫిర్యాదు చేశారు. దీనిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరినట్లు తెలిసింది. శుక్రవారం తాడిపత్రిలోనే ఉన్న ఎస్పీ దృష్టికి కూడా ఈ విషయం వెళ్లింది. ముస్లింల ఆందోళన, ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు ప్రబోధానంద స్వామిపై విచారణ మొదలుపెట్టారు. శుక్రవారం రాత్రి డీఎస్పీ చిదానంద రెడ్డి ఈ అంశంపై సమీక్షించారు. ప్రబోధానందస్వామిపై ముస్లింలు ఇచ్చిన ఫిర్యాదుపై సమగ్రంగా విచారణ జరుపుతున్నామని డీఎస్పీ తెలిపారు.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.