Apr 26 2017 @ 02:09AM

27 నుంచి పరుచూరి రఘుబాబు నాటకోత్సవాలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): పరుచూరి రఘుబాబు స్మారక 27వ అఖిల భారత నాటకోత్సవాలను ఈనెల 27నుంచి మే 1వరకు నిర్వహించనున్నారు. పరుచూరి రఘుబాబు స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పల్లెకోనలో ఈ నాటకోత్సవాలను నిర్వహించనున్నారు. చివరి రోజున విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు. కళాకారులు, కళా సంఘాలు ఈ నాటకోత్సవాలకు హాజరు కావాలని రఘుబాబు స్మారక ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ పరుచూరి వెంకటేశ్వరరావు ఆహ్వానించారు.